Thursday, May 2, 2024

చార్మినార్ వద్ద వరల్డ్‌కప్‌ ట్రోఫీ.. సెల్ఫీల కోసం పోటీ

spot_img

ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న భారత్‌లో ఈసారి వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 జట్ల మధ్య ఈ క్రికెట్ వార్ ఇండియా వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుంది. అయితే ఈ వరల్డ్‌కప్ ట్రోఫీని ఒక్కసారైనా కళ్లారా చూడాలనుకునే వారు కోట్లలో ఉంటారు. అటువంటి వారి కోసం వరల్డ్ కప్ ట్రోఫీ టూర్‌ను ఐసీసీ ప్రారంభించింది.

Read Also: డ్రైవర్ల కుమార్తెలకు స్కాలర్‌షిప్‌ ప్రకటించిన మహీంద్రా కంపెనీ

మొదటిసారిగా జూన్ 27న భారత్‎లో ట్రోఫీని ప్రదర్శించారు. ఆ తర్వాత వరల్డ్ కప్ ట్రోఫీ టూర్‌లో భాగంగా భారత్ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలలో ప్రదర్శించారు. అనంతరం సెప్టెంబర్ 4 నుంచి ట్రోఫీని భారత్‌ తీసుకువచ్చారు. అప్పటి నుంచి చెన్నైలో ట్రోఫీని ప్రదర్శించి.. తాజాగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా గురువారం చార్మినార్‌, జింకానా గ్రౌండ్ వద్ద ట్రోఫీని ప్రదర్శించారు. అనంతరం ఉప్పల్‌ స్టేడియంలో మధ్యాహ్నం నుంచి కొద్దిసేపు ట్రోఫీని సందర్శనకు ఉంచారు. అదేవిధంగా ఇనార్బిట్ మాల్‌లో కూడా కప్‎ను ప్రదర్శించారు. ట్రోఫీని దగ్గర నుంచి చూసి, దానితో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు.

Read Also: బీఆర్ఎస్‏లో చేరిన కిషన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్

Latest News

More Articles