Tuesday, May 21, 2024

డ్రైవర్‌ లేకుండానే 78 కి.మీ. ప్రయాణించిన రైలు

spot_img

 

డ్రైవర్‌ లేకుండానే ఓ గూడ్స్‌ ట్రైన్‌ 78 కి.మీ. ప్రయాణించిన ఘటన జమ్మూలోని కథువాలో జరిగింది.ఇవాళ( ఆదివారం) ఉదయం 8.47 గంటల సమయంలో క్రషర్లతో నిండిన గూడ్స్‌ రైలు జమ్మూలోని కతువా స్టేషన్‌ నుండి పంజాబ్‌లోని హోషియాపూర్‌ వైపు వేగంగా ప్రయాణించడం ప్రారంభించింది. రైలు ఇంజన్‌ పవర్‌ ఆఫ్‌లో ఉండగానే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

కథువా స్టేషన్‌లో డ్రైవర్‌ దిగిపోయినప్పటికీ .. నెంబర్‌ 14806 గల ట్రైన్‌ ఆగకుండా గంటకు 100 కి.మీ స్పీడ్ లో 78 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరకు పంజాబ్‌లోని ముకేరియన్‌ సమీపంలో నిలిచిపోయింది.  అప్పటికే అలర్టైన అధికారులు   లెవెల్‌ క్రాసింగ్‌లను మూసి వేయాల్సిందిగా గేట్‌మెన్‌లకు మెసేజ్‌ పంపడంతో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు.  దసుహా దగ్గర రైల్వే ట్రాక్‌పై చెక్క దిమ్మెలను ఉంచి రైలును ఆగిపోయేలా చేశారు. హ్యాండ్‌బ్రేక్‌ వేయడం మర్చిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు డ్రైవర్ తెలిపాడు. రైలు కదులుతున్నప్పుడు తాను అక్కడ లేనని చెప్పాడు. ఈ ఘటనపై  విచారణకు ఆదేశించించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆర్టీసీ విలీనంపై సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ  

Latest News

More Articles