Sunday, May 19, 2024

మేడారం జాతర ఎఫెక్ట్.. 20శాతం చార్జీలు పెంచిన ఉబర్, ర్యాపిడో

spot_img

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి(బుధవారం) నుంచి ఈ నెల 24 వరకు జాతర జరగనుంది. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6వేల ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. అయితే హైదరాబాదులో ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సిటీ బస్సులను కూడా ఆర్టీసీ అధికారులు మేడారం జాతరకు నడుపుతున్నారు. మెయిన్ రూట్లలో అరకొర బస్సులను తిప్పుతున్నారు. ఈ విషయం తెలియక ప్రయాణీకులు గంటల తరబడి బస్టాప్ లలో పడిగాపులు కాస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఉబర్, రాపిడో 20శాతం చార్జీలు పెంచాయి. డ్యూటీలకు వెళ్లేవారు తప్పని పరిస్థితిలో చార్జీలు ఎక్కువైనా వెళ్లక తప్పడం లేదంటున్నారు ఉద్యోగులు.

ఇది కూడా చదవండి:ప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

Latest News

More Articles