Saturday, May 18, 2024

ప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

spot_img

ఉత్తరప్రదేశ్‌ కోర్టులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. 2018 పరువు నష్టం కేసులో రాహుల్‌కు సుల్తాన్‌పూర్‌ ప్రత్యేక కోర్టు ఇవాళ(మంగళవారం) షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. కర్ణాటక ఎన్నికల సమయంలో 2018 మే 8న బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. హోం మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ.. బీజేపీ నాయకుడు విజయ్‌​ మిశ్రా అనే వ్యక్తి అదే ఏడాది ఆగస్టు 4న పరువు నష్టం కేసు వేశాడు.

ఓ వైపు బీజేపీ నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలకు కట్టుబడి ఉందని ప్రకటిస్తూనే మరో వైపు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌ వ్యాఖ్యలు చేసిన సమయంలో అమిత్‌ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్నారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు రాహుల్ కు బెయిల్ మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి:వికటించిన స్మైల్ డిజైనింగ్ ఆపరేషన్.. కాబోయే వరుడి మృతి

Latest News

More Articles