Monday, May 6, 2024

ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తి సీఎంగా ఉన్నారు

spot_img

తెలంగాణ కోసం సిరిపురం యాదయ్య ప్రాణాలు త్యాగం చేసిన రోజు నేడు. నిప్పు అంటించుకొని అమరుడు అయ్యాడు. ఎంతో మంది ఉద్యమకారుల పోరాట ఫలతం నేటి తెలంగాణ. వారికి జోహార్లు అని తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇవాళ(మంగళవారం) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు.

మలిదశ తెలంగాణ పోరాటంలో షాద్‌నగర్‌ ప్రజలు ఉద్యమ స్ఫూర్తిని చాటారని ప్రశంసించారు.  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఏ పిలుపునిచ్చినా ఉద్యమంలో ముందునిలిచి పోరాడారని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్‌ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు.

తెలంగాణ అమరవీరులకు ఒక్క నాడు పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు జై తెలంగాణ అని వ్యక్తి సీఎం అయ్యాడు.ఉద్యమ కారులపైకి తుపాకి పట్టుకొని వెళ్లిన వ్యక్తి సీఎం అయ్యాడు. గుర్తు చేసుకుంటే బాధ అనిపించింది. మొన్న 7 వేల ఓట్లతో ఓడిపోయాం. కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు నమ్మి ప్రజలు ఓటు వేశారు. గెలుపు ఓటములు ఉంటాయి. అధికారం, ప్రతిపక్షం అయినా మనం ప్రజల పక్షం ఉందాం. వారి వెంట పడి హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం. కార్యకర్తలకు ఇబ్బంది ఉంటే ఒక్క ఫోన్ కొట్టండి గంటలో ఉంటాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చినం. ఏనాడు జై తెలంగాణ అని వారు కాంగ్రెస్ పార్టీ.. మార్పు అని ఎన్ని మాటలు చెప్పారు. ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మళ్లీ స్పీడ్ అందుకుంటాం. కేఅర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించారు. కేసీఆర్ నల్లగొండలో గర్జిస్తే అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆరులో 13 గ్యారెంటీలు ఉన్నాయి. రెండు అయిపోయాయని ప్రచారం చేసుకుంటున్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలు కోటి 50 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు 2500 ఇవ్వడం లేదు. బడ్జెట్ లో నిధులు పెట్టలేదు. గ్యారెంటీలు నమ్మాలని బాండ్ పేపర్లు రాసిచ్చారు. కానీ మోసం చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో హామీల పేరిట మోసం చేశారు. ప్రమాణ స్వీకారం మాత్రం త్వరగా చేశాడు, హామీల అమలు మాత్రం చేయడం లేదని విమర్శించారు హరీశ్ రావు.

కరోనా సమయంలో కేసీఆర్ అధికారులు, ఎమ్మెల్యేలకు పైసలు ఆపి రైతులకు ఇచ్చారు.కరోనా అప్పుడు మేము రైతు బంధు ఇచ్చాం.. కానీ ఇప్పుడు ఏ సమస్యా లేకున్నా ఎందుకు రైతు బంధు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.రైతులకు పంట బోనస్ ఇవ్వాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సత్తా చూపిద్దాం. ఉద్యోగాల విషయంలో సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్క పోస్ట్ నింపలేదు. అవి బీఆర్ ఎస్ పాలనలోనివే. హామీల గురించి అడిగితే అసెంబ్లీలో తప్పుడు శ్వేత పత్రాలతో డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవాలు బయట పెడితే, తిట్టడం మొదలు పెట్టారు. అబద్ధాలు తప్ప నిబద్దత లేనిది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనివి కూడా మేము చేశాం, వాళ్ళు చెప్పినవి కూడా చేయడం లేదు.

బీజేపీ, కాంగ్రెస్ రెండు పాలమురును మోసం చేశాయి. జాతీయ ప్రాజెక్ట్ తేవడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయన్నారు హరీశ్ రావు. బీఆర్ఎస్ వచ్చాకనే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వచ్చింది.21 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. నెలకు 10 వేలు వారికి ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గెలిచే పరిస్థితి లేదు. బీ ఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే మన సమస్యల గురించి పోరాటం చేస్తారు. మహబూబ్ నగర్ ఎంపీ బీఆర్ఎస్ గెలవాలి. భవిష్యత్తు మనదే ఇది నిజం… కార్యకర్తలు కష్టపడాలని సూచించారు.

ఇది కూడా చదవండి:మేడారం జాతర ఎఫెక్ట్.. 20శాతం చార్జీలు పెంచిన ఉబర్, ర్యాపిడో

Latest News

More Articles