Friday, May 17, 2024

నేటి నుంచి మేడారం మహాజాతర..!!

spot_img

తెలంగాణ మహాకుంభమేళా నేటి నుంచి ప్రారంభం కానుంది. వన జాతర మేడారం జనంతో నిండిపోయంది. సమ్మక్క సారలమ్మ జాతరలో కీలక ఘట్టం వచ్చేసింది. జనమంతా మేడారం బాటపడుతున్నారు. కొన్నిగంటల్లో మొదలయ్యే మేడారం జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా మేడారంకు చేరుకుంటున్నారు.

సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరి 8గంటలకు వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడు. పూజారి పోలెబోయిన సత్యం కన్నెపల్లిలోని ఇంట్లో ఉన్న పూజా సామాగ్రిని శుద్ధి చేసిన అనంతరం జంపన్న గద్దెకు అలుకుపూతలు నిర్వహించి ఆయన ప్రతిరూపమైన డాలు, కర్రకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గ్రామ మహిళలు ఊరు పొడవునా నీళ్లుపోస్తు జంపన్ననను సాగనంపారు. సారలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సారలమ్మ కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ నేటి నుంచి మొదలుకానుంది.

ఆదివాసీ , సాంప్రదాయం ప్రకారం సాయంత్రం 6గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ పూజారులు, మంత్రి సీతక్క ములుగు కలెక్టర్ ఎస్పీ అదనపు కలెక్టర్లు, ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. ఈలోపే పూజారులు, అధికారులు కొండాయి నుంచి గోవిందరాజులును, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారం గద్దెల దగ్గరకు చేరుస్తారు. వరాల తల్లి సమ్మక్క గురువారం మేడారం గద్దెలపైకి రానుంది. ఇద్దరు వన దేవతులు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో కిటికిటలాడుతుంది. శనివారం వనదేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో జాతర ముగుస్తది.

ఇది కూడా చదవండి: మరోసారి తల్లిదండ్రులైన విరాట్-అనుష్క..పేరుకూడా పెట్టేశారు..!!

Latest News

More Articles