Thursday, May 2, 2024

మరోసారి తల్లిదండ్రులైన విరాట్-అనుష్క..పేరుకూడా పెట్టేశారు..!!

spot_img

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తమ బాబుకు అకాయ్ గా పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ జంటకు ఇప్పటికే ఓ పాప వామిక ఉన్న సంగతి తెలిసిందే. బాబు పుట్టడంతో విరాట్ అనుష్క జంటకు అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

మేం ఫిబ్రవరి 15న మా కుమారుడు అకాయ్ ఈ లోకంలోకి స్వాగతించాం. మా జీవితంలోకి ఈ మధురమైన క్షణాల్లో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాం. మా గోప్యతను గౌరవించండి అంటూ విరాట్ పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరమయ్యారు.

ఇది కూడా చదవండి: శరీరంలో విటమిన్ ఏ లోపిస్తే ఈ సమస్యలు తప్పవు..!!

Latest News

More Articles