Sunday, May 19, 2024

మేడారం మహాజాతర..ప్రధాని మోదీ శుభాకాంక్షలు..!!

spot_img

తెలంగాణ కుంభమేళా..ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ..మేడారం సమ్మక్క సారలక్క జాతర ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం. మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరి 8గంటలకు వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడు. పూజారి పోలెబోయిన సత్యం కన్నెపల్లిలోని ఇంట్లో ఉన్న పూజా సామాగ్రిని శుద్ధి చేసిన అనంతరం జంపన్న గద్దెకు అలుకుపూతలు నిర్వహించి ఆయన ప్రతిరూపమైన డాలు, కర్రకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గ్రామ మహిళలు ఊరు పొడవునా నీళ్లుపోస్తు జంపన్ననను సాగనంపారు. సారలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సారలమ్మ కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ నేటి నుంచి మొదలుకానుంది.

ఆదివాసీ , సాంప్రదాయం ప్రకారం సాయంత్రం 6గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ పూజారులు, మంత్రి సీతక్క ములుగు కలెక్టర్ ఎస్పీ అదనపు కలెక్టర్లు, ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. ఈలోపే పూజారులు, అధికారులు కొండాయి నుంచి గోవిందరాజులును, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారం గద్దెల దగ్గరకు చేరుస్తారు. వరాల తల్లి సమ్మక్క గురువారం మేడారం గద్దెలపైకి రానుంది. ఇద్దరు వన దేవతులు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో కిటికిటలాడుతుంది. శనివారం వనదేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో జాతర ముగుస్తది.

ఇది కూడా చదవండి: 18ఏళ్లుగా దుబాయ్ లో జైల్లో ఉన్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి..!!

Latest News

More Articles