Monday, May 6, 2024

నిరుద్యోగులకు శుభవార్త..1056 పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్..!!

spot_img

నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది కేంద్రప్రభుత్వం. యూపీఎస్సీ సీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్ సైట్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం నమోదు ప్రక్రియను ఇప్పటికే ప్రారంబించింది.  ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2024లో పాల్గొనాలనుకుంటే అధికారిక వెబ్ సైట్లో మార్చి 5లోపు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

ఈ యూపీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం 1056 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ 1056 పోస్టుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా మొత్తం 21 ఉన్నతస్థాయి సర్వీసుల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఎంపిక ప్రక్రియను యూపీఎస్సీ చేపట్టనుంది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదంటే బ్యాచిలర్ డిగ్రీకి సమానమైన అర్హత కలిగి ఉండాలి. ఇందులో ఈ ఏడాది బ్యాచిలర్ డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మెయిన్స్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేవారకి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
-ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
-2024 మార్చి 5 ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ.
-ఆన్ లైన్ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సవరణకు కూడా ఛాన్స్ ఉంది.
-2024 మార్చి 6 నుంచి 12 వరకు సవరణ చేసుకోవచ్చు.
-అర్హులైన వారికి 2024 మే 26న ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది.
– మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ 20 నుంచి 5రోజులు నిర్వహిస్తారు.
– http://upsc.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం..బస్సులో 50మంది ప్రయాణీకులు..!!

 

Latest News

More Articles