Friday, May 17, 2024

అభివృద్ధి ఆగొద్దంటే మళ్ళీ సీఎం కేసీఆర్ నే గెలిపించండి

spot_img

ఎన్నికలప్పుడే కనిపించే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆ తర్వాత కనిపించకుండా పోతారని.. కనిపించకుండా పోయే నాయకులు కావాలా? నిత్యం ప్రజల్లో ఉండి అభివృద్ధి చేసే నాయకులు కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రిమ బుధవారం శంకుస్థాపన చేశారు.

నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుతో పాటు, బస్తీ దవఖానను ప్రారంభించారు. అనంతరం ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆరేపల్లి గ్రామం మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. కరీంనగర్ గడ్డపై ఒకసారి గెలిచిన వారు వరుసగా రెండోసారి గెలిచిన చరిత్ర లేదని, నాకు హ్యాట్రిక్ విజయాలు కట్టబెట్టిన మీకు ఎప్పుడు రుణపడి ఉంటాన్నారు.

కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేలకోట్ల నిధులను విడుదల చేశారన్నారు. పచ్చని తెలంగాణను చూస్తే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కడుపు మండుతుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు.కాంగ్రెస్, బీజేపీలకు అధికారం కట్టబెడితే ఇక్కడి బొగ్గు, నీరు, కరెంటు, హైదరాబాద్ సంపదను దోచుకుంటారని, మళ్లీ ఆ తప్పు జరగొద్దన్నారు. స్వరాష్ట్రంలో మత ఘర్షణలు తలెత్తకుండా శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయని, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.

Latest News

More Articles