Sunday, May 12, 2024

భార్య పుస్తెలు అమ్మి పోటీ చేశానన్న సంజయ్‌కు ఇన్ని కోట్లు ఎక్కడివి ?

spot_img

గత ఎన్నికల్లో తన భార్య పుస్తెలు అమ్మి పోటీ చేశానని చెప్పుకున్న బండి సంజయ్‌ కి నేడు కోట్ల రూపాయలు ఎక్కడ నుండి వచ్చాయని ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్. అవినీతి పరుడివి కాకుంటే నిన్ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ రూరల్ మండలం ధుర్షెడ్, ఇరుకుళ్ల గ్రామాల్లో ఇవాళ(ఆదివారం) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో గంగులకు ఘన స్వాగతం పలుకగా మంత్రి ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కే నా మద్దతు

అధ్యక్ష పదవి ఇస్తే కోట్ల రూపాయలు వసూళ్లు చేసి నేడు ఓటుకు ఇరవై వేలు ఇచ్చి గెలిచేందుకు బండి సంజయ్ చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు మంత్రి గంగుల. మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మాయం అయ్యే వ్యక్తి బండి సంజయ్ అని, ఎంపీగా గెలిచికా నాలుగున్నరేళ్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓడించేందుకు దొంగలంతా ఏకమయ్యారని, కేసీఆర్‌ ఓడిస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పాలన వస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్ద దొంగ అని.. ఆయనకు ఓటేస్తే మీ భూములు మాయం చేస్తాడని హెచ్చరించారు మంత్రి గంగుల. ఆంధ్రా నాయకులు బీజేపీ, కాంగ్రెస్ రూపంలో ఒక్కటయ్యారు. వాళ్లని నమ్మి ఓటు వేస్తే తెలంగాణలో మళ్లీ కరెంటు కోతలతో చీకట్లేనని అన్నారు. ఓటు పవిత్రమైనదని ఒక్క ఓటు తప్పు జరిగితే యాభై ఏళ్ల దరిద్రం చూడల్సి వస్తుందన్నారు. మరోసారి బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి తెలంగాణను కాపాడుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: రూ.4 వేల కోట్లతో జగిత్యాలను అభివృద్ధి చేశాం

Latest News

More Articles