Saturday, May 18, 2024

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు

spot_img

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వ పూనుకుంది. వరి నాట్లు వేసుకోవడానికి వీలుగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదలచేసింది. అందులో భాగంగా రంగనాయక సాగర్‎లోకి మంత్రి హరీష్ రావు నీటిని విడుదల చేశారు. దాంతో రంగనాయక సాగర్‎లోకి ఒక పంప్ ద్వారా గోదావరి జలాలు వచ్చి చేరుతున్నాయి. రంగనాయక సాగర్‎లోకి 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రంగనాయక సాగర్ నుండి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే తమ ప్రథమ కర్తవ్యం అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Latest News

More Articles