Saturday, May 18, 2024

ఎమ్ఎన్ జే కేన్సర్ ఆసుపత్రి దేశంలో పెద్ద ఆసుపత్రి

spot_img

హైదరాబాద్ ఎమ్ఎన్ జే కేన్సర్ ఆసుపత్రి దేశంలో పెద్ద ఆసుపత్రి అని అన్నారు మంత్రి హరీశ్ రావు. ముంబై, బెంగళూరు లో మన తర్వాత 600 పడకలు ఉన్నాయన్నారు. ఇవాళ(సోమవారం) ఎమ్ఎన్ జే కేన్సర్ ఆసుపత్రిలో రోబోటిక్ ఆపరేషన్ థియేటర్ ని ప్రారంభించారు మంత్రి. ఆ తర్వాత మాట్లాడిన ఆయన..ఇక నుంచి కేన్సర్ రోగులకు రోబో ద్వారా శస్త్ర చికత్సలు చేయనున్నారు. రోబో కొనుగోలుకు 32 కోట్లు రూపాయిలను ప్రభుత్వం కేటాయించింది.పెరుగుతున్న కేన్సర్ రోగులు కోసం 120 కోట్ల రూపాయిలు కేటయించడం జరిగింది. గతంలో ఈ ఆసుపత్రిలో కేవలం 3 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి..అవి కూడా 60 ఏండ్ల కిందట నిర్మించినవే.వారికి కనీసం ఆపరేషన్ థియేటర్లు కట్టాలన్న ఆలోచన రాలేదన్నారు.

పీఎస్ లో ప్రీ వెడ్డింగ్ షూట్.. పోలీసు జంటపై సీపీ షాకింగ్ రియాక్షన్

బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చాలా ఖరిదైనది, కానీ ప్రభుత్వం ప్రజల కోసం ఉచితంగా అందిస్తోందన్నారు మంత్రి హరీశ్ రావు. రాష్ట్రం లో ప్రభుత్వ ఆసుపత్రి లో రెండో రోబో మెషిన్, నిమ్స్ ఆసుపత్రిలో ఉన్న దాని కన్నా అడ్వాన్స్ డ్ రోబో అని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి లో అనేక రకాల సౌకర్యలు కల్పించామన్నారు. పేషెంట్స్ తో పాటుగా పేషెంట్ అటెండర్స్ కూడా భోజనం సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు మంత్రి హరీశ్ రావు. అవసాన దశలో ఉన్న వారి కోసం పాలెటివ్ కేర్ సర్వీసెస్ ని కూడా అందిస్తున్నాం..దీనిని 33 జిల్లాలో ఏర్పాటు చేసామన్నారు.

ఇది కూడా చదవండి: సికింద్రాబాద్‌లో ఆల్ఫా హోటల్ సీజ్!

హోమ్ కేర్ సర్వీస్ ని కూడా అందిస్తున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. కేన్సర్ ట్రీట్మెంట్ అందించడంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉందన్నారు. సీఎం కేసీఆర్ మార్గానిర్దేశంలో వైద్యారోగ్య రంగం బలోపేతం అయ్యిందన్నారు. 6నెలలు వంద కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్స్ నిమ్స్ ఆసుపత్రిలో చేసామన్నారు. త్వరలో గాంధీ ఆసుపత్రిలో ఆర్గాన్ ట్రాన్సప్లాంట్ వార్డ్ ని ప్రారంభిస్తున్నామని.. 35 కోట్ల రూపాయలుతో, పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు మంత్రి.

పిల్లలు నెలలు తరబడి కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు కోసం స్కూల్ ని కూడా ప్రారంభించడం జరిగిందన్నారు మంత్రి హరీశ్ రావు. మహిళలకు సంబంధించి ఉమెన్ వింగ్ ని ప్రారంభిస్తున్నామన్నారు. మహిళలకు ఆరోగ్య మహిళ కేంద్రం ద్వారా వైద్య సేవలు అందించడంతో పాటు 250 మంది మహిళలను ఎర్లీ డీటెకేషన్ కింద గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. 900 కోట్ల రూపాయిల తో ఆరోగ్య శ్రీ కింద కేన్సర్ కి ట్రీట్మెంట్ అందించనున్నట్లు తెలిపారు మంత్రి హరీశ్ రావు.

ఇవి కూడా చదవండి: 
తెలంగాణపై మోడీ మరోసారి విషం.. కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

Latest News

More Articles