Saturday, May 18, 2024

కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదు

spot_img

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మాట దేవుడెరుగు, వాళ్లు గెలిస్తే ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుతారని విమర్శించారు మంత్రి హరీశ్ రావు. నిజామాబాద్ జిల్లా మాణిక్ బండారు రోడ్ షోలో మాల్గొని మాట్లాడారు మంత్రి. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే మంచిది. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదు. 9 ఏండ్ల కాలంలో సుభిక్షమైన పరిపాలన అందించాం.ఎన్నికలప్పుడొచ్చి ఆగమాగం చేసే పార్టీలను నమ్మోద్దు. మోసపోవద్దు గోస పడవద్దు. మరోసారి పెద్ద మనసుతో ఆశీర్వదించండి. ప్రజా ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ పక్క.. ఆర్మూర్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పక్క ఉన్నారని తెలిపారు మంత్రి హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: వీరు చెలరేగితే.. ప్రపంచ కప్ భారత్ దే

Latest News

More Articles