Saturday, May 18, 2024

కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పాలించిన సాగునీళ్లు ఇవ్వలేదు

spot_img

వనపర్తి జిల్లా: తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ దశ మారింది. చేసిన అభివృద్దిని చూసి మరోసారి అవకాశం ఇవ్వాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చినంక మారిన జీవన పరిస్థితులు మీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. సాగునీటికి, కరెంట్ కు డోకా లేదు. పంటకు ఎదురు పెట్టుబడి ఇచ్చి పంటలు పండిన తరువాత కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటలను కొని నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే అని అన్నారు.

Also Read.. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదు

ఎన్నికల తరువాత దొడ్డు బియ్యం స్థానంలో పేదలకు సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది.  కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పాలన చేసినప్పుడు సాగునీళ్లు ఇవ్వలేదు. ప్రజలను వలసలు పాలు చేసి పట్టించుకోలేదు. సింగోటం నుండి ఒక కాలువ ద్వారా గోపాల్ దిన్నే రిజర్వాయర్ కు నీళ్లు వస్తే చివరి ప్రాంతాలకు ఇబ్బంది ఉండదని కొల్లాపూర్ ఎమ్మెల్యేతో కలిసి సిఎం కేసిఆర్ ను పలుమార్లు కలిసి ఒప్పించాను. రూ.150 కోట్లతో కలువ పనులు నడుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని తెలిపారు.

Also Read.. ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ క‌న్నుమూత‌

పింఛన్లు, రైతుబంధు పెంచడంతో పాటు సబ్సిడీ మొత్తం ప్రభుత్వం భరించి రూ. 400 లకు సిలిండర్, భూమి లేని వాళ్లకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా వర్తింప చేయడం జరుగుతుంది. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి గృహలక్ష్మి పథకం అమలు చేయడం జరుగుతుంది. గడిచిన 10 ఏండ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Latest News

More Articles