Saturday, May 4, 2024

మనకు కాంగ్రెస్ కావాలా, కరెంట్ కావాలా ఆలోచించాలి

spot_img

మనకు కాంగ్రెస్ కావాలా, కరెంట్ కావాలా ఆలోచించాలన్నారు మంత్రి కేటీఆర్. బీబీపేట్ మండల కేంద్రంలోని రోడ్ షో మాట్లాడారు. 55 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే చేసిందేమీ లేదు. బీబీపేట్ ను మండలం చేసింది కేసీఆర్. గతంలో కరెంట్ ఉంటే వార్త, ఇప్పుడు కరెంట్ లేకపోతే వార్త. గతంలో కరెంట్ సమస్యలతో ప్రజా ప్రతినిధులు గ్రామాల్లోకి వెల్లాలంటే భయపడే పరిస్థితి.. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు సీఎం కేసీఆర్. గతంలో వరి ధాన్యం ఇంత పండిస్తుంటిమా ఒకసారి ఆలోచన చేయాలి. రైతే ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి వరి ధాన్యం ఇంతగా పండిస్తున్నారు. ఒక వైపు రైతుల ప్రభుత్వం, మరో వైపు రాబందు కాంగ్రెస్.. ఎది కావాలో ఒకసారి ఆలోచన చేయాలన్నారు.

మనకు కాంగ్రెస్ కావాలా, కరెంట్ కావాలా ఆలోచించాలన్న మంత్రి కేటీఆర్..కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి మళ్ళీ పాత రోజులకు వెళ్దామా అని అన్నారు. రెండు సార్లు మంచి చేసిన కేసీఆర్ ను వదిలి.. వేరే వారికి అధికారం ఇద్దామా ఆలోచించాలన్నారు. రైతు బంధు దుబారా అంటున్న కాంగ్రెస్ కు ఓటు వేద్దామా ఆలోచించాలన్నారు. ఢిల్లీ మాట వినే ప్రభుత్వం మనకు అవసరమా, అలాంటి వారి చేతుల్లో మన ప్రభుత్వం పెడదామా. ఓటుకు నోటు తీసుకున్న రేవంత్ రెడ్డి మస్తు మాట్లాడుతున్నాడు. బీడీలు చుట్టే 4.5 లక్షల అక్కా చెల్లెళ్ళకు పెన్షన్ ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.

తెల్ల రేషన్ కార్డులు కలిగిన పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇస్తాం, 400 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం, సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా 3 వేల రూపాయల పెన్షన్ ఇచ్చే పథకాలు తీసుకువచ్చామన్నారు మంత్రి కేటీఆర్. తెల్లరేషన్ కార్డు కలిగిన వారందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తామన్నారు. అసైండ్ భూములు ఉన్నవారికి హక్కు పత్రాలను అందజేస్తామన్నారు. కారు గుర్తుకు ఓటు కేసీఆర్ ను గెలిపించాలని కోరారు. కామారెడ్డికే ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నాడు కాబట్టి ఇక్కడికి అన్నీ వస్తాయన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఇక్కడ నేనే ఉంటా, కేసీఆర్ కు ఒక్క ఓటు వేయండి నేను, కేసీఆర్, గంప గోవర్ధన్ ముగ్గురం కూలి పని చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి: వీరు చెలరేగితే.. ప్రపంచ కప్ భారత్ దే

Latest News

More Articles