Friday, May 17, 2024

కిండర్‌ గార్టెన్‌లో ఆయుధాల డంప్.. బయటపెట్టిన ఇజ్రాయెల్

spot_img

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం మొదలై నెల రోజులు గడిచిపోయింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్‌ దాడులు మరింత తీవ్రం చేస్తున్నది. మరోవైపు ఐక్యరాజ్య సమితి, పాలస్తీనా ప్రభుత్వం గాజా స్ట్రిప్‌లో మానవతా సహాయం అందించేందుకు కాల్పుల విరమణను ప్రకటించాలని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.

Also Read.. మనకు కాంగ్రెస్ కావాలా, కరెంట్ కావాలా ఆలోచించాలి

కాగా, ఇటీవల ఐడీఎఫ్‌ గాజాలో అల్‌ షిఫా దవాఖానను ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆసుపత్రిలోకి సైన్యం ప్రవేశించడంపై విమర్శలు వచ్చాయి. అయితే, ఆసుపత్రి, పాఠశాలల్లో హమాస్‌ కార్యకలాపాలు కొనసాగిస్తుందంటూ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఆయుధాలను దాచిపెట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.

Also Read.. కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పాలించిన సాగునీళ్లు ఇవ్వలేదు

ఈ మేరకు ఆయుధాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ డిఫెన్స్ విడుదల చేసింది. కిండర్‌ గార్టెన్‌లో రాకెట్‌ లాంచర్లు, మోర్టార్‌ షెల్స్‌ ఉన్న వీడియోను ఇజ్రాయెల్‌ సైన్యం విడుదల చేసింది. హమాస్‌ పౌరులను మానవ కవచంగా ఉపయోగించుకుంటోందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్నది.

Latest News

More Articles