Monday, May 6, 2024

వీరు చెలరేగితే.. ప్రపంచ కప్ భారత్ దే

spot_img

అహ్మదాబాద్ : వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2023 ఫైన‌ల్ కోసం కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడోసారి ట్రోఫీని ముద్దాడేందుకు టీమిండియా అడుగు దూరంలో నిల‌వ‌గా.. ఐదుసార్లు చాంపియ‌న్ ఆస్ట్రేలియా గ‌ట్టి పోటీనివ్వాల‌ని భావిస్తోంది.

Also Read.. ఎన్నికలు మూడు రోజుల పండుగ కాదు..ఐదేండ్ల భవిష్యత్తు

ఆదివారం అహ్మ‌దాబాద్‌లో జ‌రిగే ఫైన‌ల్లో ఐదుగురి మ‌ధ్య ‘నువ్వా నేనా’ అనే రేంజ్‌లో ఫైట్ సాగుతుంద‌ని శ‌నివారం ఐసీసీ ఒక పోస్ట్ పెట్టింది. విరాట్ కోహ్లీ VS హేజిల్‌వుడ్, రోహిత్ శ‌ర్మ VS మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాద‌వ్ VS గ్లెన్ మాక్స్‌వెల్‌, స్టీవ్ స్మిత్ VS ర‌వీంద్ర జ‌డేజా, మ‌హ్మ‌ద్ ష‌మీ VS డేవిడ్ వార్న‌ర్ పోరు టైటిల్ విజేత‌ను నిర్ణ‌యిస్తుంద‌ని తెలిపింది.

Also Read.. రేవంత్ రెడ్డికి షాక్.. కారెక్కిన బాలకిషన్ యాదవ్

కాగా, ఫైనల్ సందర్భంగా ప్ర‌పంచ క‌ప్ విన్నింగ్ కెప్టెన్ల‌ను స‌న్మానించ‌నుంది బీసీసీఐ. టీమిండియాకు ప్ర‌పంచ క‌ప్ అందించిన క‌పిల్ దేవ్, మ‌హేంద్ర సింగ్ ధోనీలతో పాటు క్లైవ్ లాయిడ్(వెస్టిండీస్), అల‌న్ బోర్డ‌ర్(ఆస్ట్రేలియా), అర్జున ర‌ణ‌తుంగ‌(శ్రీ‌లంక‌), స్టీవ్ వా(ఆస్ట్రేలియా), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా), మైఖేల్ క్లార్క్(ఆస్ట్రేలియా), ఇయాన్ మోర్గాన్(ఇంగ్లండ్)లను సన్మానించనున్నారు.

Latest News

More Articles