Friday, May 3, 2024

సంగారెడ్డి గడ్డపై ఈ సారి గులాబీ జెండా ఎగరేస్తాం

spot_img

సంగారెడ్డి: సంగారెడ్డి గడ్డపై ఈ సారి గులాబీ జెండా ఎగరేస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎన్ని గ్రామాల్లో తిరిగారని ప్రశ్నించారు. సదాశివపేట పట్టణంలోని మహబూబ్ పాషా దర్గా గ్రౌండ్ లో మంత్రి హరీష్ సమక్షంలో మనబిన్ ఫౌండేషన్ చైర్మన్ ఎంఏ మొకిమ్ సాహెబ్, కౌన్సిలర్ ఇలియస్ షరీఫ్ వారి అనుచరులు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ లో చేరారు. సంగారెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్, TSMIDC చైర్మన్ ఏరోళ్ళ శ్రీనివాస్,మాజీ టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ ముదిరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read.. హ‌మాస్ ఉగ్ర సంస్ధ కాదు.. ట‌ర్కీ అధ్య‌క్షుడు ఎర్డోగాన్‌ సంచలన వ్యాఖ్యలు

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరికతో బీజేపీ, కాంగ్రెస్ స్నేహ బంధం బట్టబయలు అయ్యిందన్నారు. కోమటిరెడ్డి అన్నదమ్ములు ఇద్దరు ఏ పార్టీలో ఉన్న ఒకరికి ఒకరి గెలుపు కోసం పని చేస్తారని పేర్కొన్నారు. ఢిల్లీలో రెండు పార్టీల మధ్య స్నేహ బంధం భయటపడిందని, తెలంగాణలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు అయ్యిందని తెలిపారు.

Also Read.. మేడిగడ్డ ఆనకట్ట డిజైన్ లో ఎలాంటి లోపాలు లేవు

కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పని చేసింది. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి రోజు మాట్లాడుకుంటున్నారు. బిజెపి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవరిని పంపాలని చూస్తున్నారు. బీజేపీ పార్టీకి కేసీఆర్ ని తట్టుకోలేక కాంగ్రెస్ తో చేతులు కలిపింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని నిరుగార్చడానికి రెండు పార్టీలు ఎన్నో కుట్రలు చేశాయన్నారు.

Also Read.. కర్ణాటక గోస తెలంగాణకు అవసరమా.. కేటీఆర్ కీలక కామెంట్స్

రాహుల్ గాంధీ ఉంటే నరేంద్ర మోడీకి బలం అని బిజేపి వాళ్ళు అనుకుంటున్నారు. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు తెలంగాణ శక్తి. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే విషం చిమ్మే పార్టీలు కాంగ్రెస్, బిజెపి. అన్నం పెట్టే నాయకుడు కేసీఆర్.. సున్నం పెట్టె పార్టీలు విపక్షలవి. పొరపాటున కాంగ్రెస్ కి ఓటేస్తే 60 ఏళ్ల కిందికి పోతుంది. మూడో సారి కేసీఆర్ ని గెలిపించుకోకపోతే రాష్ట్రం ఆగం అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు.

Latest News

More Articles