Saturday, May 18, 2024

కర్ణాటక రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్మించి.. మోసం చేసింది

spot_img

హైదరాబాద్: కాంగ్రెస్ ను నమ్మితే కర్ణాటక రైతులను ఎలా ముంచారో చూస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కర్ణాటక ప్రజలకు రెండు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. సబ్ స్టేషన్స్ వద్ద కర్ణాటక ప్రజలు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో కలిసి ఆయన తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Also Read.. తండ్రి బాటలోనే.. డైరెక్టర్‌గా త్రివిక్రమ్ కొడుకు ఎంట్రీ!

కర్ణాటక రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో రైతులు రాత్రిపూట కరెంట్ వలన పాము కాటుకి, కరెంట్ షాకులకు చాలా మంది చనిపోయారని, కరెంట్ లేక పంట నష్టపోయి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని ప్రజలను మోసం చేయడం కోసమే తప్పా అమలు చేయడానికి కాదన్నారు.

Also Read.. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హైడ్రామా

’’తెలంగాణలో ఒక్క నిమిషం కరెంట్ కోత లేదు. మేము ఉహించిన దాని కంటే డిమాండ్ ఎక్కువ వచ్చినా కరెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సెప్టెంబర్ నుంచే 25 శాతం ఎక్కువ డిమాండ్ వచ్చినా కూడా కరెంట్ ఇస్తున్నాం.  రైతులు జాగ్రతగా ఉండాలి. కాంగ్రెస్ మాటలు నమ్మతే మోసపోతాం. కాంగ్రెస్ పార్టీ అనేక అబద్దాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంది‘‘ అని జగదీష్ రెడ్డి తెలిపారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు కూడా కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ఇవ్వలేకపోతుందని, తెలంగాణలో ఒక్క మోటార్ కాలిపోకుండా కరెంట్ ఇచ్చిన ఘనత బిఆర్ఎస్ సర్కారుది అని పేర్కొన్నారు.

Latest News

More Articles