Saturday, May 18, 2024

చదువుతోనే జీవితానికి వెలుగు వస్తుందని నమ్మే వ్యక్తి సీఎం కేసీఆర్

spot_img

విద్యతోనే జీవితానికి వెలుగు వస్తుందని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో విద్యారంగం అభివృద్ధి చెందిందని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమె అన్నారు. శనివారం రాత్రి సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో ఐలాపురం గ్రామం వద్ద రూ. 4.2 కోట్లతో నిర్మించిన టీటీడబ్ల్యూ ఆర్‏జెసి బాలికల పాఠశాల మరియు కళాశాలలో ప్రారంభించారు. ముందుగా మంత్రిని విద్యార్థులు ఘనంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. అభివృద్ధి విద్యతోనే సాధ్యమని అందుకే కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు. ఏదైనా సమాజంలో వెనుకబాటుతనానికి విద్య లేక పోవడమే కారణమని, అందుకే చిన్న చిన్న దేశాలు భారతదేశంపై దండెత్తి వందల సంవత్సరాలు ఆక్రమించుకుని పరిపాలించాయని తెలిపారు. ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్న కులాల అంతరాలు పోవాలంటే విద్య వల్లే సాధ్యమవుతుందని నమ్మిన కేసీఆర్.. దేశంలో ఎక్కడా లేనివిధంగా వెయ్యి గురుకుల పాఠశాలలను నెలకొల్పారని అన్నారు.

Read Also: భార్యను హనీమూన్ తీసుకెళ్లి.. బెడ్ రూం వీడియోలు తీసి..

అందరూ చదువుకునేలా జ్యోతిరావు ఫూలె, బీఆర్ అంబేద్కర్, సంత్ సేవలాల్ ప్రజలను విద్య వైపు మళ్ళించే విధంగా పోరాటం చేశారని, వారి ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలలన్నీ జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆడపిల్లలు సౌకర్యాలు లేక తమ విద్యను మధ్యలోనే ఆపివేస్తున్నారని, వారికి రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేసి ప్రభుత్వం అధిక నిధులు వెచ్చించి ఆడపిల్లలు బాగా చదువుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి అన్నారు. బాగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి.. కేసీఆర్ ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థిలోకానికి పిలుపునిచ్చారు.

Read Also: ఏపీలోని ఆ గ్రామంలో నైటీలు వేసుకుంటే ఫైన్

Latest News

More Articles