Friday, May 17, 2024

ఔదార్యాన్ని చాటుకున్న మంత్రి జగదీష్ రెడ్డి

spot_img

సూర్యాపేట జిల్లా: క్యాన్సర్ బారిన పడిన బాధితురాలికి దైర్యం అనే మందును రంగరించి క్యాన్సర్ ను జయించాలంటూ రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన ఔదార్యాన్ని చూపుకున్నారు.

సహజంగానే వ్యాధుల బారిన పడిన బాధితులను అక్కున చేర్చుకోవడం ఆర్ధికంగా వేసులు బాటు లేని కుటుంబాలకు బాసటగా నిలబడడం విద్యార్థి ఉద్యమాల నుండి ఆయనకున్న నైజం. గడిచిన తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా ఉండడంతో పాటు అందు కోసమేప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి సేవలు అందిస్తున్న సదరు మంత్రి జగదీష్ రెడ్డికి క్యాన్సర్ బారిన పడిన ఓ పేషేంట్ ఉదంతం దృష్టికి చేరింది.

ఇంకేం తెలిసిన వెంటనే ఆ పేషేంట్ బాగోగులు వాకబు చేసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి సదరు పేషేంట్ మనసులోని భావాలను అర్థం చేసుకున్నారు. మనోధైర్యంతో ఆ పేషేంట్ లోని భయాన్ని దూరం చేయడం ద్వారా క్యాన్సర్ మీద విజయం సాధించేలా ధైర్యం అనే మందుతో ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా అప్పటికే ఎదో జరిగి పోతుందనుకున్న పేషేంట్ కు మంత్రి తో కలసి ఒక సారి భోజనం చెయ్యాలని ఒక్కసారి అయినా పోలీస్ ఆఫీసర్ కావాలన్న మనసులోని మాటను ఆ పేషేంట్ మంత్రి ముందు వెలిబుచ్చింది.

అడగక ముందే వరాలు ఇచ్చే ఆపద్బాంధవుడిగా పేరున్న మంత్రి జగదీష్ రెడ్డి రెండు తన చేతిలోని పనేగా అంటూ ఆ పేషేంట్ ను కుటుంబ సభ్యులను సాదరంగా తన యింటికి ఆహ్వానించారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్దిఉత్సవాలలో బిజీగా ఉన్న మంత్రి జగదీశ్ రెడ్డి తమ లాంటి సామాన్యులకు టైం ఇవ్వడం అంటే మామూలు మాట కాదనుకున్న ఆ కుటుంబం ఈ ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.

సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం జగన్ తండా కు చెందిన ధరవత్ చాంప్ల-భూభా దంపతుల కుమార్తె స్వాతి చదువుతో పాటు ఆట పాటల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉన్న స్వాతి ఒక్కసారిగా జ్వరం బారిన పడింది. దానికి తోడు కామెర్లు రావడం ఆపై ఫ్రాంక్రియాటిస్ కేన్సర్ గా మారడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు మానసిక ఆందోళనకు గురయ్యారు. మందులతో కాలాన్ని నెట్టుకోస్తున్న స్వాతి పరిస్థితి చెయ్యి దాటి పోయేలా ఉందనుకున్న తల్లి తండ్రులు.. నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పమ్మా అన్న ప్రశ్నకు మంత్రి జగదీష్ రెడ్డి తో మాట్లాడలని,  ఆయనను చూడాలని.. ఆయనతో కలిసి భోజనం చెయ్యాలని ఉందంటూ తన మనసులోని మాటను స్వాతి బయట పెట్టింది.

ఈ విషయాన్ని స్వాతికి ట్రీట్ మెంట్ అందజేస్తున్న డాక్టర్ల బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసి ఆమెతో పాటు కుటుంబసభ్యులతో కలసి అల్పాహారం బుజించారు. ఈ క్రమంలోనే తనకు ఒక్కసారి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని మంత్రి జగదీష్ రెడ్డికి విన్నవించుకుంది. వెంటనే ఎస్పీ రాజేంద్రప్రసాద్ కు ఫోన్ లో విషయాన్ని వివరించి స్వాతి మనసులో మాటను తీర్చాలంటూ ఆదేశించారు.

Latest News

More Articles