Friday, May 3, 2024

దేశానికి అన్నం పేట్టే రైతు నిజాయితీపరుడు.. సగం ధాన్యం మనమే పండిస్తున్నం

spot_img

మహబూబ్ నగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎండాకాలంలో సైతం చెరువులు అలుగులు పారుతున్నాయని, దీంతో రైతులు రెండు పంటలను పండి పండిస్తున్నారని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం అయన మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ మండలం కోడూరు గ్రామ క్లస్టర్ రైతు వేదికలో ఏర్పాటుచేసిన రైతు దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ రాకపూర్వం విద్యుత్తు, సాగు నీరు లేక చెరువులు ఎండిపోయి వ్యవసాయం చేయలేక బతుకుతెరువు కోసం రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు ఉండేవన్నారు. రైతులు  కూలీలుగా మారిపోయారని, అలాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు ఉచిత విద్యుత్ తో పాటు, సాగునీరు, రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు, పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల గౌరవం పెరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో సగానికి పైగా 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నదని తెలిపారు. 70 ఏళ్లుగా అనేక కష్టాలు పడిన ప్రజలు ఇప్పుడు వ్యవసాయంతో పాటు, పరిశ్రమల ద్వారా లాభపడుతున్నారని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే మహబూబ్ నగర్ జిల్లా అంతట కాలుల ద్వారా నీరు పారిస్తామని,దీనితో మహబూబ్ నగర్ జిల్లా స్వరూప మారిపోతుందని, సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఒక్క కోడూరు గ్రామంలోనే 1219 మంది రైతులకు 100 కోట్ల రూపాయలు రైతుబంధు కింద పెట్టుబడిగా ఇవ్వడం జరిగిందని మంత్రి వెల్లడించారు. అంతేకాక 214 మంది రైతులు చనిపోతే 10 కోట్ల 70 లక్షల రూపాయలు రైతు బీమా కింద  వారి కుటుంబాలకు ఇచ్చామని, గతంలో ఏ ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని వారి ఇంటి  దగ్గర కొనుగోలు చేయలేదని, అలాంటిది తెలంగాణ వచ్చాక వారి ఇంటి దగ్గరే కొనుగోలు చేస్తున్నామని, నేరుగా ధాన్యం డబ్బులను వారి ఖాతాలలో వేస్తున్నామని తెలిపారు.

రైతు నిజాయితీపరుడని, దేశానికి అన్నం పెట్టే వాడని అన్నారు. కల్యాణ లక్ష్మి , రైతుబంధు, రైతు బీమా, పెన్షన్ వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పాలనను చేరువ చేసేందుకు నూతన కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించడం జరిగిందని, మహబూబ్నగర్ జిల్లాను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్ది అన్ని వృత్తులను కాపాడుతామని మంత్రి వెల్లడించారు.

Latest News

More Articles