Sunday, May 12, 2024

ఎలక్షన్ షెడ్యూల్ మీద కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

spot_img

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. సమీకృత కలెక్టరెట్ భవనాన్ని ప్రారంభించారు. కలెక్టర్‎ను కుర్చీలో కూర్చొపెట్టి అభినందించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

Read Also: భార్య కాపురానికి రావట్లేదని కరపత్రాలలో ఏం రాసి పంచాడో తెలుసా?

‘జయశంకర్ సార్ పేరు మీద జయశంకర్ భూపాల జిల్లా అని పేరు పెట్టిన ఈ జిల్లా కలెక్టరెట్‎ను ప్రారంభించే అవకాశం నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. జీవితం అంతా తెలంగాణ కోసమే జీవించి, పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా తెలంగాణదే అన్నట్లుగా తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి జయశంకర్ సార్. అటువంటి జయశంకర్ సార్ పేరు మీద మనం వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం, కలెక్టర్ కార్యాలయం ఏర్పాటుచేసుకున్నాం.

Read Also: ఈ రోజే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్

మన రాష్ట్రానికి చాలామంది ఇతర రాష్ట్రాల అధికారులు వస్తుంటారు. వారు మన జిల్లా కలెక్టరెట్లు చూసి.. మా సెక్రటేరియట్లు కూడా ఇలా ఉండవని చెబుతుంటారు. ఇంత గొప్పగా నిర్మించాలని చెప్పిన కేసీఆర్ కు మనందరం ధన్యవాదాలు చెప్పాల్సిందే. తొమ్మిదిన్నర సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి. ఈ కాలంలో తెలంగాణ నమూనా ఏంటి అంటే.. సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా. ఇదేదో పదాల కూర్పు అనుకోవద్దు, ఇది అక్షర సత్యం. ఏ రాష్ట్ర అభివృద్ధి చూసినా కొన్ని తేడాలంటాయి, కానీ తెలంగాణలో మాత్రం అన్నింట్లో సమాన అభివృద్ధి ఉంటుంది. బౌగోళికంగా, జనాభాపరంగా చూస్తే తెలంగాణది 11వ, 12వ స్థానం. కానీ, దేశానికి ఆర్థికంగా చేయూతనిచ్చే రాష్ట్రాలలో తెలంగాణది 4వ స్థానం. 2014లో తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ 10లో కూడా లేదు. కానీ, ఇప్పుడు నెంబర్ వన్ స్థానానికి వచ్చాం. అటు ఐటీ, ఇటు వ్యవసాయంలో కూడా అగ్రభాగానా ఉన్నాం. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసేవాళ్లం, ఇప్పుడు 3.5 కోట్ల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. పరిశ్రలను పెంచుకుంటూనే, పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటున్నాం. పల్లె ప్రగతి అవార్డులలో 30 అవార్డులు మనమే గెలుచుకుంటున్నాం. ఈ విధంగా అన్ని రంగాలలో దేశానికే రోల్ మోడల్‎గా ఎదిగాం.

Read Also: కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం హైజాక్!

ఈ రోజు 12 గంటలకు ఎలక్షన్ కోడ్ వస్తుందట, అందుకే అందరూ హడావిడిగా ఉన్నారు. నాకైతే ఎలాంటి ఆదుర్దా కానీ, టెన్షన్ కానీ లేదు. ఎందుకంటే మాకు ప్రజల మీద అచంచలమైన విశ్వాసం ఉంది. ప్రజలు తప్పకుండా పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. 2014లో తెలంగాణ పరిస్థితి ఏంది.. ఈ రోజు తెలంగాణ పరిస్థితి ఏంది? ఆనాడు తాగునీటి పరిస్థితి ఏంది.. ఈనాడు తాగునీటి పరిస్థితి ఏంది? 2014లో కరెంట్ పరిస్థితి ఏంది.. ఈ రోజు తెలంగాణలో కరెంట్ పరిస్థితి ఏంది? ఆనాటి సాగునీటి పరిస్థితి ఏంది.. ఈనాటి సాగునీటి పరిస్థితి ఏంది? అప్పడు సంక్షేమం ఏంది.. ఇప్పుడు సంక్షేమం ఏంది? ఇవన్నీ ప్రజలకు తెలుసు.. అందుకే మేం ధైర్యంగా ముందుకెళ్తున్నాం. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మళ్లీ ఇక్కడే కలుసుకుందాం’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles