Sunday, May 19, 2024

ఈ రోజే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్

spot_img

కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, మిజోరాం ఎన్నికల షెడ్యూల్‎ను విడుదల చేయనుంది.

Read Also: సీఎం కేసీఆర్ గుడ్‎న్యూస్.. నగదు రహిత చికిత్స కోసం ట్రస్ట్‌

ఈ ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటించింది. తెలంగాణలో అక్టోబర్‌ 3 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, ఎన్నికల నిర్వహణపై సమీక్షి నిర్వహించింది.

తెలంగాణలో 119 స్థానాలు, మధ్యప్రదేశ్ 230 స్థానాలు, మిజోరాం 40 స్థానాలు, ఛత్తీస్ గడ్ 90 స్థానాలు, రాజస్థాన్ 200 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఛత్తీస్ గడ్ లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఒకే విడతలో ఎన్నికల కసరత్తు పూర్తిచేయనున్నారు.

Read Also: జెట్ స్పీడులో మంత్రి కేటీఆర్.. నేడు నాలుగు జిల్లాల్లో పర్యటన

కాగా.. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17న ముగియనుండగా.. తెలంగాణ, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో ముగియనున్నాయి.

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, మిజోరంలో ఎంఎన్‌ఎఫ్‌ వంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి.

Read Also: కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం హైజాక్!

అక్టోబర్ 6, 2018న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో 18 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న తొలి దశ పోలింగ్ జరగగా, 72 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న రెండో దశ పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 28న ఒకే దశలో ఎన్నికలు జరగగా, రాజస్థాన్, తెలంగాణలో డిసెంబర్ 7న ఓటింగ్ జరిగింది. మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రం డిసెంబర్11, 2018న ఏకకాలంలో జరిగింది.

Latest News

More Articles