Saturday, May 18, 2024

లులు 3500 కోట్ల పెట్టుబడులు.. యువతకు భారీగా ఉపాధి అవకాశాలు

spot_img

హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ లో లులు హైపర్ మార్కెట్ మాల్ ను మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ పాల్గొన్నారు.

Also Read .. సద్ది తిన్న రేవు తలవాలి.. పనిచేసిన కేసీఆర్ ని ఆశీర్వదించాలి

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేరళ నుంచి దుబాయ్ కు వెళ్లి 20కి పైగా దేశాల్లో లులు గ్రూప్ తమ కార్యకలాపాలను విస్తరించింది. లులు 3500 కోట్లను రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. తెలంగాణ యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆక్వా, ఫార్మింగ్ వంటి వాటిలోనూ లులు పెట్టుబడులు పెడుతుందని అన్నారు.

Also Read.. గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. కొనేందుకు మంచి ఛాన్స్ ఇదే!

300 కోట్ల పెట్టుబడితో అందుబాటులోకి వచ్చిన లులు మాల్ తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని అందించనుంది. ఈ మెగా మాల్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో లులూ హైపర్‌మార్కెట్ ఏర్పాటైంది. 1,400 మంది సీటింగ్ కెపాసిటీ కలిగిన 5-స్క్రీన్ సినిమా, మల్టీ-క్యూసిన్ ఫుడ్ కోర్ట్, పిల్లల వినోద కేంద్రం మొదలైనవి ఉన్నాయి.  ఈ మాల్‌ 2,000 మందికి పైగా సిబ్బందికి ఉపాధి కల్పిస్తుంది.

Latest News

More Articles