Saturday, May 4, 2024

అక్టోబర్ 2, 5వ తేదీల్లో 36వేల ఇండ్లు పంపిణీ.. ఇవే చివరివి కాదు

spot_img

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2BHK డబుల్ బెడ్రూమ్స్ మూడవ విడత ఇండ్ల పంపిణీ కేటాయింపు కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,కాలేరు వెంకటేష్,అరికపుడి గాంధీ, భేతి శుభాషన్ రెడ్డి,ఎమ్మెల్సీ హైమద్ భేగ్, హైద్రాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి,జిహెచ్ఎంసీ కమిస్నర్ రోనార్ల్డ్ రోస్,మేయర్ విజయలక్ష్మి,పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Also Read.. దారుణం..రూ.10కోసం యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టడంతో..!!

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జరుగుతోందన్నారు.  36వేల ఇండ్లను రెండు ఫేజ్ లలో పంపిణీ చేస్తామన్నారు. అక్టోబర్ 2, 5వ తేదీన పంపిణీ కార్యక్రమాలు ఉంటాయి. ఇదే చివరి పంపిణీ అంటూ ప్రచారం జరుగుతోంది…అది తప్పుడు ప్రచారం.  మరో 30వేల ఇండ్ల నిర్మాణం జరుగుతోంది.  ఈ డ్రాలో రాని వారికి భవిష్యత్ లో వస్తది. విమర్శలు చేసే వాళ్లకు సవాల్ చేస్తున్నా ప్రధానితో పాటు – ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ కట్టినట్లు చూపిస్తే రాజీనామా చేస్తా అని సవాల్ చేశారు.

Also Read: జమ్మూలో భారీ పేలుడు, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు..!!

ఈ ప్రభుత్వం నాలుగు కాలాల పాటు ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది. 2014 కు ముందు పాలన ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచన చేయాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ అభవృద్ధి చెందుతోంది.  ఇన్ని రోజులు డబుల్ బెడ్ రూమ్ ల గురించి మాట్లాడిన నోళ్ళు ఇప్పుడు మాట్లాడటం లేదు.  రాని వాళ్ళు ధైర్యంగా ఉండండి. తల తాకట్టు పెట్టి అయినా ఇల్లు ఇస్తాం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభం అయిందే సనత్ నగర్ నియజకవర్గంలో.. గాలి మాటలు మాట్లాడం సులువు – పని చేయడం కష్టం అని మంత్రి అన్నారు.

Latest News

More Articles