Sunday, May 19, 2024

వారెంటీ లేని కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా చేయాలి

spot_img

ఖమ్మం జిల్లా: వారెంటీ లేని కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ గెలుపు అభివృద్ధికి మలుపు కావాలన్నారు. రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

Also Read.. సిటీ బ‌స్సుల్లో యూపీఐ సేవ‌లు

నెలకు 12వేలు

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు ఉన్నాయి. ఒకసారి పంట పెట్టిన తర్వాత 30- 35 ఏళ్ల వరకు నాలుగో సంవత్సరం నుంచి మొదలుపెడితే 30,35 ఏళ్ల వరకు నెలకి దాదాపు 10వేల నుంచి 12 వేల రూపాయలు జీతం వచ్చినట్టే  మీ అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి ఉంటది. పంట పెట్టిన తర్వాత నాలుగేళ్ల వరకు గెలలు రావు గేలలు వచ్చేంతవరకు అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు.250 మందికి ప్రత్యక్షంగా..పరోక్షంగా 300 మందికి ఉపాధి దొరుకుతది. రైతన్నలకు ఎకరానికి లక్ష 25 వేల నుంచి 1,50,000 వరకు లాభం చేకూరుతుందన్నారు.

Also Read.. కాంగ్రెస్‌లో టికెట్ల అమ్మకాల లొల్లి

నాడు నెర్రెలు బారిన నేలలు.. నేడు సస్యశ్యామలం

ఒకనాడు కాంగ్రెస్ పరిపాలనలో నెర్రెలు బారిన నేలలుంటే.. ఈరోజు బీడు భూములు సస్యశ్యామలమై వరి ధాన్యం పంటలో ఈరోజు భారతదేశంలోనే పంజాబ్, హర్యానాను తలదన్ని నెంబర్ వన్ స్థానానికి ఎదిగినం. మిషన్ కాకతీయలాంటి కార్యక్రమం.. కొత్త రిజర్వాయర్లు రావడంతో ఈరోజు మన తెలంగాణ ఒక నీలి విప్లవాన్ని కూడా చూస్తోంది. మత్స్యకారుల కు లాభం చేకూరుతుంది.  కడుపునిండా కరెంటు ఇచ్చే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి తప్పకుండా మా రైతన్నలను కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు సాంప్రదాయేతర పంటల వైపు ఆలోచన చేయాలని సూచించారు.

Also Read.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై శుభవార్త

ప్రజలు చాలా చైతన్యవంతులు

ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారెంట్‌ లేని కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా చేయాలనని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ గెలుపు అభివృద్ధికి మలుపు కావాలన్నారు. జిల్లాలో రాజకీయం మారుతతుంది. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలి. కొంతమంది పార్టీలు మారి కేవలం పదవి ఇస్తే కేసీఆర్ మంచోడు.. పదవి పోతే కేసిఆర్ చెడ్డోడు అని తిట్లు తిడుతున్నారు. ఇదేనా నీతి. కాంగ్రెస్  ఉన్నప్పుడు పెన్షన్ రూ.200 ఇచ్చి ఇప్పుడు 4,000 ఇస్తామంటున్నారు.  అమ్మకు అన్నం పెట్టినవాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read.. ఖమ్మం గడ్డపై మంత్రి కేటీఆర్.. రూ.1369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Latest News

More Articles