Sunday, May 19, 2024

నవంబర్ 30న బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

spot_img

యాదాద్రి భువనగిరి: నవంబర్ 30వ తేదీన బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. యాదగిరిగుట్టలోఈరోజు తరలి వచ్చిన జనాన్ని చూస్తే ఆలేరులో గొంగిడి సునీతా గెలిచినట్లుగా అనిపిస్తుందన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2014 లో యాదగిరిగుట్ట ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం ఏoత అద్భుతంగా నిర్మాణం చేపట్టారు కేసీఆర్ అని పేర్కొన్నారు.

ప్రపంచం గర్వించదగ్గగా తెలంగాణ ప్రభుత్వం హయాంలో యాదాద్రి ఆలయం నిర్మాణం రూపుదిద్దుకుంది. డిసెంబర్ 3 వతేది తరువాత యాదగిరిగుట్ట కొండ పైకి ఆటోలు నడిచేవిధముగా చర్యలు చేపడుతాము.  తెలంగాణ రాష్టము ఏర్పడ్డాక రైతులకు వ్యవసాయ బావుల వద్దకరెంట్ కష్టాలు తీరినవి. కాంగ్రెస్ నాయకులు రైతన్నలకు 3 గంటలు కరెంట్ చాలు అంటున్నారు. వాళ్లకు ఎద్దు తెలువదు వ్యవసాయము తెలువదు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఉండాలంటే తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు.

కాంగ్రెస్ వాళ్లకు ఒక్కఛాన్స్ అవకాశం ఎందుకు ఇవ్వాలి. యాదాద్రిలో బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాము. రాష్ట్రంలో తాగునీరు,సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా మహిళలకు 3000 రూపాయలు అందిస్తాం.  ఒంటరి మహిళకు, బీడీ కార్మికులకు, వితంతువులకు 2000 రూపాయల పింఛన్ అందిస్తున్నాము. తెల్లరేషన్ కార్డు గల కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తాం. రైతుబీమా తరహలో ప్రతి ఇంటికి భీమా అందజేస్తం. ప్రతి ఊర్లో ఒక మహిళా సమాఖ్య భవనం ఏర్పాటు చేస్తాం. ఆలేరులో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓట్లు వేసి గొంగిడి సునీతాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Latest News

More Articles