Saturday, May 18, 2024

పేదవాళ్ల కళ్ళలో సంతోషం చూడడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

spot_img

సీఎం కేసీఆర్ అంటేనే సంక్షేమం..పేదవాళ్ల కళ్ళలో సంతోషం చూడడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ(శుక్రవారం) వరంగల్ పర్యటనలో భాగంగా ఖిల్లా వరంగల్ వాకింగ్ గ్రౌండ్ సంక్షేమ సభలో మాట్లాడారు మంత్రి కేటీఆర్. వరంగల్ తూర్పు నియోకవర్గంలో ఒకే రోజు 15,072 మందికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. విప్లవాత్మక, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాలంటే నాయకులకు తెగింపు ఉండాలి. స్వాతంత్ర్యం వచ్చిన 76 ఏళ్లలో ఎవరూ దళిత బంధు తీసుకురాలేదు. ఈ ఒక్కరోజే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 1100 మందికి దళిత బంధు ఇస్తున్నాం. కుల రహిత, వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా ఎదగాలనే ఆకాంక్ష సీఎం కేసీఆర్ ది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 2200 డబుల్ ఇండ్లు ఇస్తున్నాం. ఆడపిల్ల పెండ్లి అంటే సొంత వాళ్లే మొహం చాటేసే పరిస్థితి.సీఎం కేసీఆర్ మేనమామలా రాష్ట్ర వ్యాప్తంగా 13.50 లక్షల మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ అందించారు. ఈ ఒక్కరోజే 3 వేల మందికి గృహ లక్ష్మి.. 3,101 మంది గుడిసె వాసులకు పట్టాలు అందజేస్తున్నామన్నారు.

కరోనా లాంటి సంక్షోభం లోనూ సంక్షేమం ఆగలేదన్నారు మంత్రి కేటీఆర్. అసాధారమైన సంక్షేమం చేస్తున్నామన్నారు. 6దశాబ్దాలు చావగొట్టిన వాళ్లు.. 60 ఏళ్లు పేదలను పట్టించుకోని వాళ్ళు.. సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు రాగానే ఆగం కాకండి అని తెలిపారు మంత్రి కేటీఆర్. గతంలో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే పరిస్థితి ఉండేది..వరంగల్ లో 24 అంతస్తులతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నారు కాంగ్రెస్ వాళ్లు.. వాళ్లకు 55 ఏళ్లు అధికారం ఇచ్చారు..ఏం చేశారో చెప్పాలన్నారు.

రూ. 73 వేల కోట్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో పడ్డాయని తెలిపారు మంత్రి కేటీఆర్. రూ. 43 వేల కోట్లతో ఇంటింటికీ మంచి నీళ్ళు అందిస్తున్నామన్నారు. కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసునని..గత ప్రభుత్వాలు కరెంటు, తాగు, సాగు నీరు ఇవ్వలేదన్నారు. త్వరలోనే శుభవార్త వింటారన్న మంత్రి కేటీఆర్..ఇప్పటి దాకా ఇచ్చింది సీఎం కేసీఆరే.. మనకు భరోసాగా ఉండేది కూడా సీఎం కేసీఆరే అని అన్నారు.ఓట్ల కోసం గగిరెద్దుల్లా వస్తున్న వారిని నమ్ముదామా? అని ప్రశ్నించారు. మీకు ఎల్లవేళలా అండగా ఉండే నాయకుడు ఎమ్మెల్యే నరేందర్ ను గెలిపించుకోవాల్సిందిగా సూచించారు.

 

ఇది కూడా చదవండి: వరంగల్‌కు కేటీఆర్ గుడ్ న్యూస్..

Latest News

More Articles