Friday, May 17, 2024

కాలంతో పోటీ పడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన గొప్ప సీఎం కేసీఆర్

spot_img

కాలంతో పోటీ పడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన గొప్ప సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి కేటీఆర్. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన..పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల 6వేల పోడు ఎకరాలకు 1లక్ష 50 వేల కుటుంబాలకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో పట్టాల పంపిణీ జరుగుతోందన్నారు. కొమరం భీం జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని గిరిజన బిడ్డల జీవితాల్లో ఆచరణలో పెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు.240కోట్ల మొక్కలు నాటి వాటిని కాపాడి.. అడవిని పెంచామన్నారు.

40 లక్షల జనాభా ఉన్న గిరిజనులకు, 3106 తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత  సీఎం కేసీఆర్ దన్నారు మంత్రి కేటీఆర్. నేడు పంచిన పోడు భూములకు జూలై నుండి రైతు బంధు,రైతు బీమా ఇస్తామని తెలిపారు. వీధి వ్యాపారులు నేడు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు మంత్రి. డబల్ బెడ్ రూంలు తీసుకున్న వారి కళ్ళలో ఆనందం చూశానని తెలిపారు. మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీ , ప్రభుత్వ దవాఖాన ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.

ఏమీ చేశావు అని వరంగల్ కి వస్తున్నావు..మోడీ అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ములుగు జిల్లాలో 360 ఎకరాల భూమి ఇచ్చినా..గిరిజన యూనివర్సిటీ ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో మోడీ చూపాలన్నారు. కోచ్ ఫ్యాక్టరీ పేరుతో మోసం చేసిన గొప్ప ప్రధాని మోడీ అని అన్నారు. మోడీ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి వరంగల్ లో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్.

Latest News

More Articles