Wednesday, May 22, 2024

పనిచేసే ప్రభుత్వాన్నే ప్రజలు ఆశీర్వదిస్తారు

spot_img

ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదిస్తారని తెలిపారు మంత్రి కేటీఆర్‌. ఇవాళ(శనివారం) హైదరాబాద్‌లో పార్ట్ నర్స్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌ ప్రోగ్రామ్‌లో మంత్రి పాల్గొన్నారు. జేఆర్‌సీ దగ్గర జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి చేసిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. డిసెంబర్ 3 తర్వాత మళ్ళీ మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. మాకు విశ్వాసం ఉందన్నారు.

హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి చెప్పారు మంత్రి కేటీఆర్. ఈ మహానగరానికి చారిత్రకంగా గొప్ప పేరుందని అన్నారు. పాత హైదరాబాద్‌ నగరాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందినదని నటుడు రజినీకాంత్‌ పొగిడిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అభివృద్ధిలో హైదరాబాద్‌ న్యూయార్క్ తో పోటీ పడుతోందన్నారు.

ఇది కూడా చదవండి: ఒక బ్రోకర్ చేతిలో కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది

గత పదేళ్లలో నగరంలో 36 ఫ్లైవోర్లు నిర్మించామని, 39 చెరువులను నవీకరించామని మంత్రి చెప్పారు. మిషన్‌ భగీరథ కార్యక్రమంతో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని తెలిపారు. 70 కీమీ మెట్రో పూర్తి చేసుకున్నాము. మరో పదేళ్లలో 415 కీమీ లకు విస్తరించాలన్నది మా కల అని అన్నారు. 23 కీమీ సైకిల్ ట్రాక్ కట్టామని తెలిపారు. అన్నార్తుల కోసం హైదరాబాద్ లో 373 అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేసాము. కోవిడ్ సమయంలో.ఒక్క రూపాయి తీసుకోకుండా భోజనం అందించాము. 273 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసాము.. ఇంకో వందకు పైగా పెంచాలని అనుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇంకో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మిస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్.

అదేవిధంగా దేశంలో నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌, తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు 3.5 లక్షల ఐటీ ఉద్యోగులు ఉంటే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో 10లక్షల మంది ఐటీ ఉద్యోగులు పెరిగారని తెలిపారు మంత్రి కేటీఆర్. ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందితే దానికి అనుగుణంగా ఇతర రంగాల్లో కూడా ఉపాధి పెరుగుతుందన్నారు. వ్యాక్సిన్ల తయారీకి కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్ నిలిచిందన్నారు.

పల్లెల్లో ఓటింగ్ శాతం ఎక్కువ.. కానీ పట్టణాల్లో ఆ పర్సంటేజ్ తగ్గుతోందన్నారు. మనం ఓటు వేయకపోతే మనకు నచ్చనివాళ్లే గెలుస్తారని అన్నారు మంత్రి కేటీఆర్. అందరూ ఓటు వేయండి.. ఓటింగ్ శాతం పెంచండి అని కోరారు.

ఇది కూడా చదవండి: రాత్రి 8 నుంచి 10 వరకే క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి

Latest News

More Articles