Friday, May 3, 2024

కాంగ్రెస్ అసమర్థత వల్లే కర్ణాటక రైతులు నష్టపోతున్నారు

spot_img

హైదరాబాద్: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సరైన విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైందని, రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలు చేపడుతున్నారని, తెలంగాణలోని రైతులకు కాంగ్రెస్ పార్టీ అసమర్థత గురించి తెలుసునని, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు.

Also Read.. రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు

‘‘రైతులకు విద్యుత్‌ అందించడంలో కాంగ్రెస్‌ అసమర్థత దశాబ్దాలుగా తెలంగాణలో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కర్ణాటక రైతులు కూడా అదే అనుభవిస్తున్నట్లు కనిపిస్తోంది.  కర్నాటక ప్రభుత్వం రైతాంగానికి కరెంటు ఇవ్వడానికి నానా తంటాలు పడుతోంది. వ్యవసాయ రంగానికి సరిపడా విద్యుత్‌ సరఫరా చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని రైతులు మండిపడుతున్నారు.’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Also Read.. ఇద్దరు అమెరికన్లను విడిచిపెట్టిన హమాస్‌

యాదగిరిలో ఏడు గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం జెస్కామ్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో జిల్లాలో మిర్చి, పత్తి, ఎర్రజొన్న, వరి పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. మరోవపు షిఫ్టుల వారీగా ఐదు గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కే జార్జ్ చెప్పడంపై రైతులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

Latest News

More Articles