Monday, May 20, 2024

హైదరాబాద్ లో జి20 సదస్సు.. తెలంగాణ చారిత్రక విశిష్టతను చాటి చెప్తాం..!

spot_img

జూన్ 15-17 మధ్య హైదరాబాద్ లో జరగనున్న G 20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్లపై మాదాపూర్ హెచ్ఐసీసీ లో నిర్వహించిన సమీక్షకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆహార ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలో అగ్రగామి. హైదరాబాద్ లో జి 20 సదస్సును తెలంగాణ ఆహ్వానిస్తుంది. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుంది. వసతులు, విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలకడం, వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, కళలను పరిచయం చేస్తాం చారిత్రక విశిష్టతను చాటి చెబుతాం.హైదరాబాద్ నగరంలో సదస్సు నిర్వహించడం గర్వకారణం. దేశంలోని రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటుంది. పంటల మార్పిడిలో, వ్యవసాయంలో సాంకేతిక వినియోగంలో దేశంలో రాష్ట్రం ముందున్నది. ఈ సదస్సు లోతైన చర్చలతో ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేస్తుందని ఆశిస్తున్నాం. వ్యవసాయ రంగంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణలో ఈ సదస్సు నిర్వహించడం గర్వకారణం. పోషక ఆహార భద్రత మరియు వాతావరణ మార్పుల ప్రభావం పై ప్రముఖంగా జి20 సభ్య దేశాలు చర్చించనున్నాయి’ అని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Latest News

More Articles