Saturday, May 18, 2024

15 కోట్లు నిధులు మంజూరు.. సీఎంకి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కృతఙ్ఞతలు

spot_img

మూసాపేట మండలం, భూత్పురు మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి, మున్సిపల్ లో పలు వార్డులకు నిధులు మంజూరు చేస్తూ ఆయా గ్రామాల నాయకులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ప్రాంతం మీద ప్రేమతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కరివెన లాంటి పెద్ద ప్రాజెక్టును భూత్పురు మండలంలో నిర్మించడం ఇప్పటికే 90% పనులు పూర్తి అయ్యాయి ఆగస్టు నాటికి కరివెన లో నీటిని నింపేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు

ఇక ముఖ్యమంత్రి గారి ముందుచూపుతో ఒకనాడు ఎడారిగా ఉన్న ప్రాంతంలో గణపురం కెనాల్ ద్వారా కందురు పెద్ద వాగు ఊక చెట్టు వాగులు పారించడం తో భూ గర్భ జలాలు పెరిగి ఈ ప్రాంతంలో సాగు పెరిగి సస్యశామలంగా మారిందన్నారు. కొత్తగా భూత్పురు ను మున్సిపల్ గా ఏర్పాటు చేసుకొని వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని తండాలాకు బిటిరోడ్లు మంజూరు చేసుకొని కోన్నీటిని పూర్తి చేసుకున్నామన్నారు. గ్రామాలలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు
దేవరకద్ర నియోజక వర్గానికి 15 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Latest News

More Articles