Sunday, May 19, 2024

ఓట్ల కోసం కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని పథకాలు చెప్తుంది.. అది అయ్యే పనేనా?

spot_img

ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతోనే వేల కోట్లు ఖమ్మానికి తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పించానని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ‘ఖమ్మం నా ఇల్లు.. ఇక్కడ ప్రజలంతా నా కుటుంబ సభ్యులు’ అనే భావనతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు అధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు.

Read Also: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

‘మా నాన్న గారి హయాం నుండి గెలిచినా.. ఓడినా.. పక్క దిక్కులు ఎప్పుడూ చూడలేదు.. ప్రజల కోసమే పనిచేస్తున్న. అభివృద్ది విషయంలో ఒళ్ళు దాచుకోకుండా పని చేశా. మీరు కూడా ఇక్కడ జరిగిన అభివృద్ధిని గుర్తించాలి. BRS ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి మళ్ళీ కాపాడుకోవాలి. ఎన్నికలు వచ్చినపుడు సహజంగా చాలా మంది వస్తారు. స్వార్థంతో కూడిన ప్రేమ చూపిస్తారు.. కన్నీళ్లు పెట్టుకుంటారు.. వాటికి కరగాల్సిన పని లేదు. BRS ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్దితో ఉంది. ఒకప్పుడు ప్రతి ఇంటికి ఇన్వెర్టర్లు ఉండేవి.. కానీ ఇప్పుడు ఉన్నాయా? రైతులకు, గృహాలకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడ్డ నాటికి మనకు 7,770 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండేది.. కానీ నేడు 18 వేల మెగా వాట్స్ లభ్యతలో ఉన్నది. అనతి కాలంలోనే ఇంతటి విజయం సాధించిన కేసీఆర్‎కు మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పండినంత ధాన్యం ఎక్కడా పండదు. కోవిడ్ సమయంలో రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. కోవిడ్ సమయంలో ప్రజలకు నా కుటుంబ సభ్యులలాగే సదుపాయాలు కల్పించాం. ఓట్ల కోసం ఆచరణ సాధ్యం కాని పథకాలు కాంగ్రెస్ చెప్తుంది.. అది అయ్యే పనేనా? కేసీఆర్ ఇచ్చిన దానికి డబుల్ ఇస్తాం అంటున్నారు.. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో BRS ప్రభుత్వాన్ని మళ్ళీ ఆదరించి హ్యాట్రిక్ విజయం అందించాలని కోరుతున్నాను’ అని మంత్రి అన్నారు.

Read Also: రికార్డు ధర పలకిన బాలాపూర్ గణేష్ లడ్డూ.. డబ్బు చెల్లింపులో కొత్త నిబంధన

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మీ పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రజలకు అందజేశారు. ‘పేదల సొంతింటి కల నెరవేర్చిన మహానుభావుడు, ఆత్మబంధువు సీఎం కేసీఆర్‌. రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేదే కేసీఆర్ ఆకాంక్ష. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి వర్తింపజేస్తాం, ముఖ్యమంత్రి మానస పుత్రిక గృహలక్ష్మి పథకం. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ. తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్‌ ప్రధాన లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉన్నది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. పార్టీల కతీతమైన ప్రజాసంక్షేమమే బీఆర్ఎస్ ప్రధాన ఎజెండా. గత పాలకుల హయాంలో గ్రామాలకు లక్ష రూపాయల నిధులు తేవాలంటే సాధ్యం కాని దారుణమైన పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, బీసీ బంధు, ఆసరా పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. నిత్యం పేదల సంక్షేమం కోసం ఆలోచించేది ఒక్క కేసీఆర్ మాత్రమే.. అందుకే మనందరం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి’ అని పువ్వాడ అజయ్ అన్నారు.

Read Also: బాలాపూర్ లడ్డూ తొలి వేలం కేవలం రూ.450.. 30ఏళ్లుగా ఎవరెవరు దక్కించుకున్నారంటే?

Latest News

More Articles