Friday, May 17, 2024

పోలీంగ్‌ శాతం పెంచడంలో యువత కీలక పాత్ర పోషించాలి

spot_img

పోలీంగ్‌ శాతం పెంచడంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. మోండా డివిజన్‌లోని ఆదయ్యనగర్‌ క్రీడ మైదానంలో యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, యువత సన్మార్గంలో నడవాలని, అప్పుడే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయన్నారు మంత్రి తలసాని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షలాది మంది యువతకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1. 30 లక్షల ఉద్యోగాలను TSPSC ద్వారా భర్తీ చేసిందన్నారు.

ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు మంత్రి తలసాని. పోలింగ్‌ శాతం పెంచడంలో యువత పాత్ర ఎంతో కీలకమైందన్నారు. యువతకు అండగా నిలిచే బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు తెలుపాలని అన్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు.

ఇది కూడా చదవండి: రిస్క్ వద్దు కారుకు ఓటు గుద్దు…కర్నాటక కష్టాలు మనకు వద్దు

Latest News

More Articles