Thursday, May 2, 2024

తెలంగాణకు మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి

spot_img

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాంగ్రెస్ పాలనలో సింగరేణి నాశనం అయింది. సింగరేణిలో కేంద్రానికి వాటి ఇచ్చి కార్మికుల పొట్ట కొట్టింది. సింగరేణిని అభివృద్ధి బాటలో తీసుకుపోతున్నం. మొన్న 1000 కోట్ల లాభాలను పంచాం. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కావాలంటే సండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Also Read.. ప్రియాంక గాంధీ సభలు అట్టర్ ప్లాప్!

భూపాలపల్లి మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. యుద్ధం చేసేటోడి చేతుల్లో కత్తి పెట్టాలి. కానీ ఇంకోని చేతుల్లో పెడితే చాలా నష్టపోతం. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ బాగా నష్టపోయింది. తెలంగాణ వచ్చిన కొత్తలో కరెంట్ కష్టాలు ఉండే. అనంతరం కాలంలో రైతుల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత కరెంట్ ను ఇస్తున్నం. పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇస్తున్నం. ఎవరైనా కాలంచేస్తే 5 లక్షల బీమాను అందిస్తున్నం. ధరణిని తీసుకొచ్చి భూములపై హక్కులను ప్రజలకే ఇచ్చినం. ఇరోజు ఇవన్ని తీసివేస్తామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది చాలా డేంజర్. దీంతో మళ్లీ దళారీల రాజ్యం వస్తది. రైతులకు జీవన్మరణ సమస్య వచ్చే ప్రమాదం ఉన్నదని కేసీఆర్ పేర్కొన్నారు.

Also Read.. రిస్క్ వద్దు కారుకు ఓటు గుద్దు…కర్నాటక కష్టాలు మనకు వద్దు

కాంగ్రెస్ కు ఓటువేస్తే 3 గంటల కరెంట్, రైతుబంధుకు రాంరాం చెబుతారు. ధరణి పోతే భూముల పంచాయతీలు వస్తాయి. అందుకే రైతులు బాగా ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు. సింగరేణిని ముంచింది కాంగ్రెస్. కేంద్రం దగ్గర అప్పులు చేసి 49 వాటాను వాళ్ల చేతుల్లో పెట్టారు చేతకాక. డిఫెండెంట్ ఉద్యోగాలు వద్దని సంతకం పెట్టింది కాంగ్రెస్ నాయకులు. వాటిని మనం పునరుద్ధరించుకున్నం. బీఆర్ఎస్ వచ్చాక 15 వేలమంది బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంత వర్షంలో మీరు వచ్చారంటేనే గండ్ర వెంకటరమణ విజయం దాదాపు ఖాయమని తేలిపోయింది. భూపాలపల్లిని జిల్లా చేసిందే కేసీఆర్. ఈ జిల్లా బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. ఈ జిల్లాకు మేలు జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణను గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు.

Latest News

More Articles