Saturday, May 18, 2024

ఏసీబీకి చిక్కిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్

spot_img

హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ చిక్కారు. రూ. 25వేలు లంచం తీసుకుంటూ ప్రిన్సిపల్ అరుణ పట్టుబడ్డారు.  పాఠశాలలో పనిచేసిన వడ్రంగి నుంచి అరుణ  లంచం తీసుకున్నారు. వడ్రంగి వేంకటాచారి 1.28లక్షల రూపాయల పనిచేసాడు.  చేసిన పనికి ఇదివరకే 75వేల రూపాయల చెక్కును ప్రిన్సిపాల్ అందజేశారు.

Also Read.. ఫజల్‌ అలీ రిపోర్టు వద్దన్నా.. కాంగ్రెసోళ్లు తెలంగాణను ఆంధ్రాలో కలిపిండ్రు

పెండింగ్‌లో  ఉన్న 52వేల రూపాయలను ఇవ్వడానికి ప్రిన్సిపాల్ లంచం డిమాండ్ చేశారు. 25వేల రూపాయలు తన బ్యాంకుఖాతాలో జమ చేస్తే మిగతా చెక్కులు ఇస్తాని ప్రిన్సిపాల్ డిమాండ్ చేశారు.  దీంతో బాధితుడు వేంకటాచారి ఏసీబీ ఆశ్రయించాడు. పక్కాగా ఏర్పాట్లు చేసి రెడ్ హ్యాండెండ్ గా ప్రిన్సిపాల్ ను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Latest News

More Articles