Sunday, May 19, 2024

మళ్లీ కేసీఆరే సీఎం.. బల్లగుద్ది చెబుతున్న ‘మిషన్‌ చాణక్య’

spot_img

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయంగా వేడెక్కింది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దాదాపు ఇప్పటివరకూ వెలువడిన సర్వేలన్నీ బీఆర్‌ఎస్‌దే మరోసారి అధికారం అని అంచనా వేశాయి. గులాబీ పార్టీ హ్యాట్రిక్‌ పక్కా.. అని మరో రెండు సర్వేలు తేల్చాయి. ఏకంగా 69-77 స్థానాలను కైవసం చేసుకొని మూడోసారి కేసీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ప్రతిపక్షాలు సమీప దూరంలో కూడా నిలవకుండా తెలంగాణ ప్రజానీకం మరోసారి సంచలన తీర్పు ఇవ్వనున్నారని పొలిటికల్‌ గ్రాఫ్‌ రీసెర్చ్‌ సర్వే తేల్చగా.. బీఆర్‌ఎస్‌ పక్షాన రాష్ట్రంలో 48% మంది ప్రజానీకం ఉన్నారని మిషన్‌ చాణక్య సర్వే స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగించనుందని సర్వేలో స్పష్టమైంది. బీఆర్‌ఎస్‌ ఏకంగా 69 నుంచి 77 స్థానాలను కైవసం చేసుకోనుందని నివేదికలో తెలిపారు. రెండో స్థానంలో ఉండే కాంగ్రెస్‌ పార్టీకి 31 నుంచి 39 స్థానాల వరకు రావచ్చ ని తేల్చారు. బీజేపీ 2 నుంచి ఆరు స్థానాలకు పరిమితం కానుండగా, మజ్లిస్‌ తన ఏడు స్థానాలను నిలబెట్టుకోనున్నదని తేల్చారు.

Read Also: ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలో ప్రారంభమైన పోలింగ్‌.. ఓటు వేయలేకపోయిన సీఎం

ఇకపోతే మరో జాతీయ సర్వే సంస్థ ‘మిషన్‌ చాణక్య’ కూడా రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ సీఎంగా కేసీఆర్‌నే కోరుకుంటున్నారని తెలిపింది. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఆయనేనని సర్వే తేల్చింది. ‘మిషన్‌ చాణ క్య’ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకా రం.. రాష్ట్రంలోని 56.41% మంది ప్రజలు సీఎంగా కేసీఆర్‌ ఉండాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ గెలిస్తే తానే సీఎం అవుతానంటూ రేవంత్‌రెడ్డి చేసుకున్న ప్రచారాలు, బీజేపీ చేసిన బీసీ సీఎం ప్రకటన వంటివి కేసీఆర్‌ కరిష్మా ముందు తేలిపోయాయని పేర్కొన్నది.

Read Also: వాహనదారులకు అలర్ట్.. నేడు హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్‌ ఆంక్షలు

బీఆర్‌ఎస్‌కు 48% ఓట్లు పడే అవకాశం ఉన్నదని సర్వే సంస్థ అంచనా వేసింది. తాము ఈ ఏడాది జూన్‌ 3 నుంచి ప్రతి జిల్లాలో అభిప్రాయాలను సేకరించామని తెలిపారు. ఈసారి 79% వరకు పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. మొత్తం పోలయ్యే ఓట్లలో.. బీఆర్‌ఎస్‌కు 48%, కాంగ్రెస్‌కు 31%, బీజేపీకి 10% ఓట్లు రావొచ్చన్నారు.

Latest News

More Articles