Monday, May 6, 2024

అమ్మాయిలూ పెళ్లి చేసుకొని తొందరగా పిల్లల్ని కనండి.. దేశాధ్యక్షుడి విన్నపం

spot_img

చైనాలో గత కొన్నేండ్లుగా జనాభా రేటు తగ్గుముఖం పడుతోంది. దీనికి తోడు చైనా యువతులు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన దేశంలో కుటుంబ వ్యవస్థను కాపాడటంలో మహిళలదే కీలకపాత్ర అని అన్నారు. సమాజంలో కొత్త ఒరవడిని నెలకొల్పడంలో మహిళలు ముందుంటారని పేర్కొన్నారు.

Read Also: మళ్లీ కేసీఆరే సీఎం.. బల్లగుద్ది చెబుతున్న ‘మిషన్‌ చాణక్య’

చైనా సంతానోత్పత్తి రేటు 2022లో చారిత్రాత్మకంగా పడిపోయి 1.09కి చేరుకుంది. దేశంలో పిల్లలు లేని జంటల సంఖ్య రెండింతలు పెరిగింది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం దేశంలో పిల్లలు లేని జంటల వాటా 2017-2022 మధ్య 20.6 శాతం నుండి 43.2 శాతానికి చేరుకుంది. పిల్లల పెంపకానికి అ‍య్యే ఖర్చు, కెరీర్ సంక్షోభం, లింగ వివక్ష తదితర అంశాలు చైనా యువత పెళ్లికి దూరంగా ఉండటానికి కారణాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో శిశు జననాల రేటు భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా అధ్యక్షుడు దేశంలోని యువత పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో చైనా వృద్ధాప్య దేశంగా మారిపోనున్నదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చైనాలో వృద్ధుల సంఖ్య అధికమవ్వగా.. మరోవైపు చైనాలో పనిచేసే వారిసంఖ్య బాగా తగ్గింది.

Latest News

More Articles