Saturday, May 4, 2024

కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి హోల్ సేల్ గా అమ్మేస్తారు

spot_img

రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో అభ్యంతరకర భాషను వాడుతున్నారు. సీఎం అని మర్చిపోయి రేవంత్ రెడ్డి తిట్ల పురాణం మాట్లాడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే కె.పి వివేకానంద. ఇవాళ(ఆదివారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన…కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మర్చిపోయింది. సీఎం అయిన నాలుగు నెలలకే రేవంత్ రెడ్డి ప్రజల విశ్వాసం కోల్పోయారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు అఫిడవిట్లు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలవకపోతే సీఎం కుర్చీ పోతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. ఆగస్టు నెలలో రైతు రుణమాఫీ చేస్తామని మహబూబాబాద్,మెదక్ సభల్లో రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణం చేశారు. దేవుడిపై ప్రమాణం చేసి ఓట్లు అడగడం అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది. 420 హామీలు నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి ఎంతమంది దేవుళ్లపై ప్రమాణం చేస్తారు. రేవంత్ రెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి,భట్టి విక్రమార్క,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తొక్కి సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వీహెచ్ , సర్వే సత్యనారాయణ, మోత్కుపల్లి నర్సింహులు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి కరెంటు తీగ అయితే ఫీజులు ఎగిరిపోతాయన్నారు.

ప్రజలు సంతోషంగా వుంటే జనజాతర. రేవంత్ రెడ్డి చేసేది ఓట్ల జాతర, కాంగ్రెస్ జాతర అని విమర్శించారు వివేకానంద. రాష్ట్రంలో ప్రజలు సాగు,త్రాగునీరు, కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు. పవర్ మినిస్టర్ భట్టి.. సీపీఐ ఆఫీస్ కు వెళ్తే అక్కడ అర్ధగంట పాటు కరెంటు పోయింది. పవర్ మినిస్టర్ కు పవర్ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి…? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు రేవంత్ రెడ్డి తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. గాంధీ భవన్ కు తాళం వేసి ఇంటి నుండే అన్ని వ్యవహారాలు నడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి హోల్ సేల్ గా అమ్మేస్తారు. ప్రజా సమస్యల పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని కాంగ్రెస్ కండువా కప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, గడ్డం రంజిత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తిరుగుబాటు చేస్తోంది. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కుదేలు అయ్యిందన్నారు. బిల్డర్లకు పర్మిషన్లు ఎందుకు ఆపుతున్నారు.సెక్రటేరియట్,ప్రభుత్వ కార్యాలయాలు,ముఖ్యమంత్రి నివాసం పైరవీలకు అడ్డాగా మారిందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి పైరవీలు లేవు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి నియంత్రించలేక పోతున్నారు. ముదిరాజ్ ఎమ్మెల్యే మీ పార్టీలో వున్నారు. ఇప్పటి వరకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు వేస్తేనే ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారా.. కేసీఆర్ బస్సు యాత్రతో మంచి ఫలితాలు వస్తాయి. హైదరాబాద్ నగరంలో  కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయన్నారు కేపి వివేకానంద.

ఇది కూడా చదవండి: వినోద్ కుమార్ గళం.. కరీంనగర్‌కు బలం

Latest News

More Articles