Monday, May 6, 2024

వినోద్ కుమార్ గళం.. కరీంనగర్‌కు బలం

spot_img

బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నిక్కార్సైన ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని అన్నారు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. దీనికి సంబందించి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. వినోద్‌ కుమార్‌ గళం కరీంనగర్‌కు బలం. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వినోద్‌ కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: మిస్ టీన్ కిరీటాన్ని సొంతం చేసుకున్న కేరళ కుట్టి

తెలంగాణ ఉద్యమంలో వినోద్‌కుమార్‌ చురుకైన పాత్ర పోషించారని కేటీఆర్‌ కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ వినోద్ కుమార్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరని తెలిపారు. 2004లో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్‌లో 32 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో వినోద్ కుమార్‌ కీలక పాత్ర పోషించారని గుర్తుచేస్తూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.

Latest News

More Articles