Saturday, May 18, 2024

బీసీలు విశ్వరూపం చూపిస్తే తట్టుకోలేవు.. రాహుల్ పై కవిత ఫైర్

spot_img

కవిత మధ్యప్రదేశ్ టూర్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై సీరియస్ అయింది. ఓబీసీ హక్కుల పరిరక్షణకు ప్రారంభించిన ఉద్యమాన్ని కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వంటి వారు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దేశంలో ఓబీసీ న్యాయమూర్తులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. ఎవరి తప్పు అది ? అనేక సంవత్సరాలు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఓబీసీ న్యాయమూర్తుల సంఖ్యను ఎందుకు ఎక్కువ చేయలేకపోయింది ? ఓబీసీలకు ఎందుకు మద్ధతివ్వలేదు ? ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఓబీసీల సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది ? ఇది ఎవర తప్పు ? ఇవన్నీ ఆలోచించదగిన అంశాలు” అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలకు చెందిన పెద్ద పెద్ద నాయకులు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెబుతారని, కానీ పనిమాత్రం చేయబోరని విమర్శించారు.

ఉద్యమిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తారన్న విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఇది దామోదర్ సింగ్ యాదవ్ ఉద్యమం కాదని, ఇది ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల కోసం ఆయన చేస్తున్న ఉద్యమమని అన్నారు. చిన్న ఆరంభమని అనుకోవద్దని, నదులు కూడా చిన్నగా మొదలవుతాయని, కానీ అవి విశ్వరూపం చూపిస్తే ఎవరూ ఎదురు నిలబడలేరని స్పష్టం చేశారు. దామోదర్ యాదవ్ ఉద్యమం ఆరంభం మాత్రమేనని, దేశవ్యాప్తంగా అది విస్తరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యువకులు, మహిళలకు ప్రధాన స్రవంతిలోకి వచ్చి ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆ రాష్ట్రానికి చెందిన ఝాన్సీ రాణి, అవంతిబాయి వంటి పోరాటయోధులు ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని అన్నారు. ఇదే రాష్ట్రానికి చెందిన ఓబీసీ మహిళా ఉమా భారతి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా జాతీయ స్థాయిలో కీలక నాయకురాలిగా ఎదిగారని ప్రస్తావించారు కవిత.

Latest News

More Articles