Saturday, May 4, 2024

కొడుకులు పట్టించుకోవట్లేదని ఆస్తిని పెంపుడు కుక్కలకు రాసిచ్చిన మాతృమూర్తి

spot_img

తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లల కోసం ఆస్తులు కూడబెడతారు. కానీ ఆ పిల్లలు ఎదిగి తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు. ముఖ్యంగా ముసలితనంలో తమ తల్లిదండ్రుల మంచి-చెడు చూడాల్సిన పిల్లలు వారిని పట్టించుకోరు. దాంతో చాలామంది ముసలివారు వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నారు. ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న ఓ తల్లి.. తన ఆస్తిని మొత్తం పెంపుడు కుక్కలకు, పిల్లులకు రాసిచ్చింది.

Read Also: పార్లమెంట్‌లో కొట్టుకున్న ఎంపీలు.. వైరల్ వీడియో

చైనాలోని షాంఘైకి చెందిన ఓ వృద్ధురాలికి ముగ్గురు పిల్లలున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ బామ్మ తన మొదటి వీలునామా రాసింది. అందులో ఆమె తన ఆస్తి మొత్తాన్ని తన ముగ్గురు పిల్లలకు పంచింది. అయితే ఆ ముగ్గురు పిల్లలు తల్లిని పట్టించుకోవడం మానేశారు. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు కనీసం చూడటానికి కూడా రాలేదు. కనీసం తమ తల్లి సంరక్షణ ఏర్పాట్లు కూడా చేయలేదు. ఆ బామ్మకు అన్ని వేళల్లో తోడుగా ఉన్నది.. ఆమె పెంపుడు కుక్కలు, పిల్లులే..! అందుకే తన సంపదనంతా తనతో ఎప్పుడూ ఉండే జంతువులకే ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. తన పెంపుడు పిల్లులు, కుక్కల పేరుతో తన రూ. 23 కోట్ల ఆస్తిని రాసి ఇచ్చింది. దాంతో ఆమె కొడుకులు లబోదిబోమంటున్నారు.

Latest News

More Articles