Saturday, May 18, 2024

పార్లమెంట్‌లో కొట్టుకున్న ఎంపీలు.. వైరల్ వీడియో

spot_img

వారందరూ ప్రజాప్రతినిధులు. ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వాళ్లు.. తమలో తామే కొట్టుకున్నారు. ఈ ఘటన మాల్దీవుల పార్లమెంట్‌లో జరిగింది. ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్‌ను అడ్డుకోవడంతో సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మాల్దీవుల పార్లమెంట్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది.

Read Also: కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి

ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు నేతృత్వంలోని కేబినెట్ కొత్త మంత్రుల ఎంపికపై ఆమోదం తెలపడానికి పార్లమెంట్‌ కీలక సమావేశం ఆదివారం జరిగింది. కొంత మంది నామినేటెడ్‌ మంత్రుల ఎంపికపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో మెజార్టీ ఉన్న మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (ఎండీపీ), డెమొక్రాట్‌లు నలుగురు కేబినెట్‌ మంత్రుల ఎంపికను తీవ్రంగా వ్యతిరేకించారు. వారి ఎన్నిక ఆమోదం కోసం జరిగిన ఓటింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాన్ని కొనసాగించకుండా స్పీకర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. స్పీకర్‌ చాంబర్‌లోకి ప్రవేశించిన విపక్ష సభ్యులు అక్కడ హంగామా చేశారు. ఈ నేపథ్యంలో అధికార ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పీపీఎం), పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్‌సీ)కు చెందిన సంకీర్ణ ప్రభుత్వం సభ్యులు విపక్ష సభ్యులపై భౌతిక దాడులకు దిగారు. దీంతో మాల్దీవుల పార్లమెంట్‌లో ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. ఈ వీడియో క్లిప్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

 

Latest News

More Articles