Sunday, May 5, 2024

విద్యార్థులకు షాకిచ్చిన కెనడా.. ఇకపై స్పాన్సర్‎షిప్ కష్టమే

spot_img

ఇప్పటివరకూ కెనడాలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు తమ జీవిత భాగస్వాములకు స్పౌస్ వీసా స్పాన్సర్ చేసే అవకాశం ఉండేది. కెనడా ప్రభుత్వం తాజాగా ఈ సౌలభ్యాన్ని తొలగించింది. దీంతో చాలామంది విద్యార్థులు ఆలోచనలో పడ్డారు.

Read Also: హాస్టల్ బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలొదిలిన బీటెక్ యువతి

ఐఈఎల్‌టీఎస్ పరీక్ష పాస్ అయిన అమ్మాయిలు.. పెళ్లిళ్ల తర్వాత కెనడా వెళ్లి, అక్కడి నుంచి తమ భర్తలకు స్పౌస్ వీసా స్పాన్సర్ చేసేవారు. సవరించిన వీసా నిబంధనల ప్రకారం, కెనడాలోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోని వారు తమ జీవిత భాగస్వాములకు వీసా స్పాన్సర్ చేసే అవకాశం లేదు. మాస్టర్స్, డాక్టోరల్, లా, మెడిసిన్ కోర్సులు చదువుతున్న వారికి మాత్రమే ఈ అవకాశం పరిమితం చేశారు. ఈ పరిణామం అక్కడి వీసా కన్సల్టెంట్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అనేక మంది తమ వ్యాపారాలను మూసే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఇప్పటికే కెనడాలో చదువుకుంటున్న వారికి తాజా నిబంధనలు వర్తించవు. సెప్టెంబర్ 1 నుంచి అక్కడికి వెళ్లే వారికి మాత్రం కొత్త రూల్స్ వర్తిస్తాయని కన్సల్టెంట్లు చెబుతున్నారు.

Latest News

More Articles