Monday, May 13, 2024

వ‌న్డేల్లో టాప్ -5 భార‌త‌ బౌల‌ర్ల‌లో సిరాజ్..!

spot_img

Mohammad Siraj : ఆసియా క‌ప్ 2023 ఫైన‌ల్లో భార‌త పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ చెలరేగి బౌలింగ్ చేయడంతో లంక బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ఫైనల్లో టీమిండియా 10 వికెట్లతో విజయం సాధించిన 8వ సారి ఆసియా కప్ ని సాధించింది.

Also Read.. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు..షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు..!!

టీమిండియా స్పీడ్‌స్ట‌ర్ హైద‌రాబాద్ కా షాన్ సిరాజ్ 6 వికెట్ల‌తో శ్రీ‌లంక ను కోలుకోలేని దెబ్బ తీశాడు. లంక టాపార్డ‌ర్‌ను చావుదెబ్బకొట్టాడు. సిరాజ్ 7-1-21-6తో కెరీర్ బెస్ట్ న‌మోదు చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కూ వ‌న్డేల్లో అతనికిదే అత్యుత్త‌మ బౌలింగ్ ప్ర‌ద‌ర్శన కావడం విశేషం. మొత్తంగా వ‌న్డే ఫార్మాట్‌లో అత్యుత్త‌మ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేసిన నాలుగో భార‌త బౌల‌ర్‌గా సిరాజ్ రికార్డు నెల‌కొల్పాడు. మాజీ పేస‌ర్ స్టువార్ట్ బిన్నీఈ జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

Aslo Read.. కేసీఆర్ డిమాండ్ కు తలొగ్గిన కేంద్రం..ఈనెల 20న మహిళ రిజర్వేషన్ బిల్లు..!!

2014లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో బిన్నీ4 ప‌రుగ‌లిచ్చి 6 వికెట్లు తీశాడు.   లెజెండ‌రీ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే రెండో స్థానంలో ఉన్నాడు. 1993లో వెస్టిండీస్‌పై కుంబ్లే 12 ప‌రుగులే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. మూడో స్థానంలో ఉన్న జ‌స్ప్రీత్ బుమ్రా.. 2022లో ఇంగ్లండ్‌పై 19 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. 2003 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఫాస్ట్ బౌల‌ర్ అశిష్ నెహ్రా.. ఇంగ్లండ్‌పై 23 ప‌రుగుల‌కే 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Latest News

More Articles