Sunday, May 5, 2024

కొత్త పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలి

spot_img

హైదరాబాద్‌ : కొత్త పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. సోమవారం పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ మెరుగైన సుపరిపాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నంబర్ వన్‌గా ఉందని తెలిపారు.

Also Read.. కేరళలో తగ్గుముఖం పడుతున్న నిపా కేసులు

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ నూతన సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించారని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళిత పక్షపాతిగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. దళిత బంధు పథకం ప్రవేశపెట్టి.. దళితులకు రూ.10 లక్షల వంతున వారి అభివృద్ధికి సాయం చేస్తున్నారని తెలిపారు.

Also Read.. తెలంగాణపై మరోసారి విషం కక్కిన మోదీ.. ఘాటూగా స్పందించిన కేటీఆర్..!!

ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి, అమోదించాలని నామ కోరారు. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రధానమంత్రి మోదీకి లేఖ కూడా రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Latest News

More Articles