Friday, June 14, 2024

డీ లిమిటేషన్ వల్ల మహిళా బిల్లు వెనక్కి వెళ్ళకూడదు

spot_img

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, తమ ప్రచారం కోసం మాత్రమే పార్లమెంట్ సెషన్స్‎ను ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీసీలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు, ఓబీసీ బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిందన్నారు. 140 కోట్ల జనాభాలో 70 కోట్ల మంది బీసీలు ఉన్నారన్నారు. అందుకే మహిళా బిల్లుతో పాటే బీసీ బిల్లు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. జనగణన చేపట్టి అందులో కులగణన చేయడం ద్వారా బీసీల శాతం ఎంత ఉందో తెలుస్తుందని, తద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. రాబోయే శీతాకాల సమావేశాల్లో ఓబీసీ బిల్లును ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. డీ లిమిటేషన్ వల్ల మహిళా బిల్లు వెనక్కి వెళ్ళకూడదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి పథకాలను ఇతర పార్టీలు కాపీ కొడుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ఎంపీ బడుగుల లింగయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: చార్మినార్ వద్ద వరల్డ్‌కప్‌ ట్రోఫీ.. సెల్ఫీల కోసం పోటీ

Latest News

More Articles